నాన్ వెజ్ తినని వారికి వాటి ప్లేస్ లో మిల్మేకర్, పన్నీర్..లాంటివి తింటారు. వాటిలాగే పూల్ మఖానా(Phool Makhana ) కూడా ఒకటి. వీటిని లోకల్ గా తామర గింజలు(Lotus Seeds) అని కూడా అంటారు. తామరపువ్వుల్లో ఒకరకమైన తామర గింజల నుంచి పూల్ మఖానా తయారు చేస్తారు. ఇవి మార్కెట్ లో ఈజీగానే దొరుకుతాయి. ఈ పూల్ మఖానాని కర్రీ, సాంబార్, బిర్యానీలలో వేస్తారు. వీటితో లడ్డూ కూడా చేసుకోవచ్చు.
పూల్ మఖానా లడ్డూ తయారీకి కావలసిన పదార్థాలు:-
* పూల్ మఖానా రెండు కప్పులు
* నెయ్యి రెండు స్పూన్లు
* నువ్వులు అర కప్పు
* పల్లీలు అర కప్పు
* బెల్లం అర కప్పు
* పుచ్చకాయ గింజలు అర కప్పు
* గుమ్మడి గింజలు అర కప్పు
ఒక మూకుడు తీసుకొని నూనె లేకుండా పూల్ మఖానా, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, నువ్వులు, పల్లీలు ఒక దాని తరువాత ఒకటి వేగనివ్వాలి. అవి వేగిన తరువాత వాటిని చల్లారనివ్వాలి. అవి చల్లారినాక వాటిని అన్ని కలిపి మిక్సి పట్టాలి. దానిలోనే బెల్లం వేసి మిక్సి పట్టాలి. అనంతరం ఒక గిన్నెలో నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు మిక్సి పట్టిన పిండిని ఆ నెయ్యిలో వేసి బాగా కలపాలి. దీంతో అది కొద్దిగా ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని రౌండ్ గా లడ్డూలాగా ఉండలు చేయాలి. అంతే పూల్ మఖానా లడ్డు తయారైనట్లే. ఇవి తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.
Also Read : Litchi Health Benefits: లిచీ పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?