Pesara Pappu Pongali: రుచికరమైన పెసరపప్పు పొంగలిని సింపుల్ తయారీ చేయండిలా?

మామూలుగా మనం దేవుళ్లకు ఎన్నో రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటాం. అలాంటి వాటిలో పెసరపప్పు పొంగలి కూడా ఒకటి. అయితే అప్పుడప్పుడు ఇలాంటి స్వీట్ ఐ

Published By: HashtagU Telugu Desk
Download (3)

Download (3)

మామూలుగా మనం దేవుళ్లకు ఎన్నో రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటాం. అలాంటి వాటిలో పెసరపప్పు పొంగలి కూడా ఒకటి. అయితే అప్పుడప్పుడు ఇలాంటి స్వీట్ ఐటమ్స్ ని దేవుళ్ళ కోసం మాత్రమే కాకుండా కొంతమంది తినాలని ఆశపడుతూ ఉంటారు. మీరు కూడా పెసరపప్పు పొంగలిని తినాలి అనుకుంటున్నారా. అయితే ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

బియ్యం – 1కప్
పెసరపప్పు – 1కప్
బెల్లం – 2కప్
నీళ్ళు – 4.5 కప్స్
జీడిపప్పు – 10
కిస్‌మిస్‌ – 10
ఎండుకొబ్బరి ముక్కలు – 1/2కప్
ఏలకుల పొడి – 1/2 టేబుల్ స్పూన్
నెయ్యి – 1/2 కప్

పెసరపప్పు పొంగలి తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా స్టౌపై పాన్ పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. ఎండుకొబ్బరి ముక్కలను కొంచెం ఎర్రగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకుని దానిలోనే జీడిపప్పు, కిస్‌మిస్‌ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి నాలుగున్నర కప్పుల నీరు పోసి స్టౌ మీద పెట్టుకోవాలి. దానిని అన్నం వండినట్లుగానే ఉడికించుకుంటూ కొంచెం నీరు ఉన్నప్పుడే దానిలో బెల్లం తురుము వేసి కరిగేదాకా మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా చూసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్‌మిస్‌తో పాటుగా నెయ్యి వేసి బాగా కలిపాలి. అంతే ఎంతో రుచికరమైన స్వీట్‌ పెసర పప్పు పొంగలి రెడీ.

  Last Updated: 17 Jan 2024, 08:08 PM IST