Eyebrows Vs Personality: కనుబొమ్మలు మనిషి హావభావాలను బయటపెడతాయి. నవ రసాలకు అనుగుణంగా మనిషి కనుబొమ్మల భంగిమలు మారిపోతుంటాయి. అయితే కనుబొమ్మలను బట్టి మనుషుల్లోని వ్యక్తిత్వ లక్షణాలను గుర్తించొచ్చు. ఒక వ్యక్తి ఎమోషనల్‌గా ఎలాంటి వాడు ? ఉద్వేగం వస్తే ఎలా స్పందిస్తాడు ? అతడి మేధస్సు స్థాయి ఎంత ? అనే అంశాలపై అంచనాకు వచ్చేందుకు కనుబొమ్మల కదలికలను మనం ప్రమాణంగా తీసుకోవచ్చు. వివిధ రకాల కనుబొమ్మల ఆకారాల గురించి, వాటిని బట్టి ఆయా వ్యక్తుల వ్యక్తిత్వం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :New Ministers List: కొత్త మంత్రుల లిస్టుపై రాహుల్ అభ్యంతరం.. వాట్స్ నెక్ట్స్ ?
కనుబొమ్మల మధ్య ఎక్కువ గ్యాప్
కొందరికి కనుబొమ్మల మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటుంది. ఇలాంటి లుక్‌తో మనకు రోజూ చాలామంది కనిపిస్తుంటారు. ఈ రకం వారు కొంత అమాయకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల ట్రాప్‌లో ఈజీగా పడతారు. తమకు తెలిసిందేే ఎక్కువ అని భావిస్తారు. ముందుచూపు లేకుండానే పనులు మొదలుపెట్టి, చిక్కుల్లో పడతారు. తమతో గొడవపడే వారిపై అనుమానం పెంచుకుంటారు. కోపం వచ్చినప్పుడు ఎమోషన్‌ను కంట్రోల్ చేసుకోలేరు. అయితే వీరి మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. అవి వెంటనే నమ్మేలా ఉంటాయి. ఈ అంశమే వీరికి వ్యాపారం, విద్య, ఉద్యోగం, కెరీర్‌లలో దన్నుగా నిలుస్తుంది. ఆత్మనిగ్రహం, సహనం అలవర్చుకుంటే వీరికి తిరుగుండదు.
వంపు కనుబొమ్మలు
కొందరికి వంపు కనుబొమ్మలు ఉంటాయి. ఇలాంటివాళ్లు ఇతరులకు సన్నిహితులుగా మారడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. ఇతరులకు తమపై నమ్మకాన్ని కలిగించేందుకు కాస్త ఎక్కువ ప్రయత్నించాల్సి వస్తుంది. అయితే మాట్లాడే నైపుణ్యం, వ్యాపార ప్రణాళిక రచించడంలో నేర్పరితనం, ముందు చూపు వంటి విషయాల్లో వీరు దిట్టలు. చక్కగా మాట్లాడుతారు. ఎమోషన్స్‌ను బాగా కంట్రోల్ చేసుకుంటారు. ఎల్లప్పుడూ నిగ్రహంగా కనిపిస్తారు. ప్రత్యేకించి వ్యాపారాల్లో వీరు బాగా రాణిస్తారు.
Also Read :BRS Defecting MLAs: ‘‘ఉప ఎన్నికలు రావు అంటారా ?’’ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ‘సుప్రీం’ ఆగ్రహం
నిటారు కనుబొమ్మలు
నిటారు కనుబొమ్మలను కలిగిన వారు ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటారు. వీరికి క్షణికావేశం ఉండదు. ఏ పనినైనా ఏకాగ్రతతో పూర్తి చేస్తారు. ప్రతీ విషయాన్ని లాజిక్‌తో ముడిపెట్టి చూస్తారు. లాజిక్ ఉన్న వాటినే నమ్ముతారు. ఆచరిస్తారు. అందుకే వీరిని కొందరు ఇష్టపడరు. వ్యాపార విషయాల్లో వీరు ఇతరులను ఈజీగా నమ్మరు. అన్ని విషయాలను లోతుగా ఆరా తీస్తారు. వీరికి ఎమోషనల్ కంట్రోల్ కెపాసిటీ ఎక్కువ. కోపం వస్తే కంట్రోల్ చేసుకోగలరు. ఉపాధ్యాయులుగా, సైంటిస్టులుగా రాణించగలరు. మేధావులుగా పేరు సంపాదించగలరు. వీరు కెరీర్‌కు సంబంధించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు.
సన్నటి కనుబొమ్మలు
సన్నటి కనుబొమ్మలున్న వారిది సాఫ్ట్ నేచర్. వీరిలో ఒక్కోసారి ఆత్మవిశ్వాసం తగ్గుతుంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో సంకోచిస్తారు. బాగా డౌట్స్ వస్తాయి. ఇతరుల సాయాన్ని కోరుకుంటారు. కొన్ని విషయాల్లో ధైర్యాన్ని ప్రదర్శించరు. రిస్క్ తీసుకోవడానికి వెనుకాడుతారు. అనవసరపు ఒత్తిడికి లోనవుతారు. తమ ఆలోచన కంటే ఇతరుల అభిప్రాయాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు.
మందపు కనుబొమ్మలు
మందపు కనుబొమ్మలు(Eyebrows Vs Personality) ఉన్నవారు చాలా క్రియేటివ్. వీరికి వ్యాపారం చేసే స్కిల్స్ ఎక్కువ. కస్టమర్లకు త్వరగా దగ్గరవుతారు. మార్కెటింగ్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. లాజికల్‌గా ఆలోచించి, ప్రతీ నిర్ణయం తీసుకుంటారు. ఎమోషన్స్‌ను బాగా కంట్రోల్ చేసుకుంటారు. కోపం వచ్చినా ఓపిగ్గా మాట్లాడుతారు. హాస్యాన్ని పండించగలరు. కామన్ సెన్స్ ఎక్కువ. కష్టాలు ఎదురైనా సాహసం కోల్పోరు. తమ లక్ష్యాల ఆధారంగా జీవితంలో ముందుకు సాగుతారు.