Pepper Chicken Gravy: పెప్పర్ చికెన్ గ్రేవీ.. ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోండిలా?

మాంసాహారం ఇష్టపడు ఎప్పుడూ ఒకే విధమైన రెసిపీలు కాకుండా అప్పుడప్పుడు ఏమైనా కొత్తగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. చికెన్ బిర్యానీ, చికెన్ గ్రే

  • Written By:
  • Publish Date - January 28, 2024 / 06:00 PM IST

మాంసాహారం ఇష్టపడు ఎప్పుడూ ఒకే విధమైన రెసిపీలు కాకుండా అప్పుడప్పుడు ఏమైనా కొత్తగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. చికెన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ,చికెన్ కబాబ్, చికెన్ తందూరి చికెన్ 65 లాంటివి తిని తిని బోర్ కొడుతోంది అని చెబుతూ ఉంటారు. అయితే అలాంటి వారీ కోసం ఈ రెసిపీ ఇంట్లోనే టేస్టీగా పెప్పర్ చికెన్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

చికెన్ – 500గ్రాములు
కొబ్బరినూనె – పావు కప్పు
పెద్ద ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిర్చి – రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ -2 టేబుల్ స్పూన్లు
టమోటాలు – రెండు పెద్దవి
పసుపు – టీస్పూన్
మిరియాలు – ఒక టీస్పూన్
గరం మసాలా – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర – కొద్దిగా
దాల్చిన చెక్క- అంగుళం ముక్క

పెప్పర్ చికెన్ గ్రేవీ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా చికెన్ బాగా కడిగి మూడొంతుల ఉడికించి పక్కనపెట్టాలి. ఒక పాత్ర తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి మసాలా దినుసులు అన్ని వేయించి,పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. దీన్ని మసాల పొడితో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అదే పాత్రలో నూనె వేసి అందులో ఉల్లిపాయలు, మిరపకాయలు, బిర్యానీ ఆకు వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేవరకు వేయించి టమోటాలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టిన మసాలా అందులో వేయాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇప్పుడు అందులో చికెన్ వేయాలి. నూనె బాగా తేలే వరకు కలిపాలి. గ్రేవీ దగ్గర పడేవరకు ఉంచి తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే సింపు స్పైసి చికెన్ పెప్పర్ గ్రేవీ రెడీ.