Sprouted Peanuts : చలికాలంలో మనం వేడి ఆహారాలకు మారాలి. గింజలు, డ్రై ఫ్రూట్స్, పండ్లను ఎక్కువగా తీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తుంటారు. పల్లీలను ఎక్కువగా తినాలని, వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటారు. పల్లీలలో ఉండే మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ చలికాలంలో మన శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి. పల్లీలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పల్లీలలో విటమిన్-ఈ పుష్కలంగా ఉండటంతో అవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వ్యాధులను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. వేరుశెనగలు రోగ నిరోధక శక్తిని పెంచి అలెర్జీల వల్ల కలిగే నొప్పి నుంచి మనల్ని కాపాడుతాయి. వేరుశెనగలోని బయోటిన్ కంటెంట్ చలికాలంలో చర్మం పొడిబారకుండా చేస్తుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం మన సొంతమవుతుంది. అయితే వేరుశెనగను ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్టులు ఉంటాయి.
We’re now on WhatsApp. Click to Join.
- పల్లీలను తరుచుగా మనం కూరల్లో లేదా ఉడికించి కూడా తీసుకుంటూ ఉంటాము.
- పల్లీలను వేయించి, ఉడికించి తీసుకోవడానికి బదులుగా మొలకెత్తించి తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు.
- మొలకెత్తిన పల్లీలను(Sprouted Peanuts) తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
- గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.
- జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
- అలసట, బలహీనత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
- ప్రతిరోజు గుప్పెడు పల్లీలను తీసుకోవడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
- చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఈ మార్పు సహాయపడుతుంది.
- మొలకెత్తిన పల్లీలు తినడం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది.