Site icon HashtagU Telugu

Peanut Rice: ఇంట్లోనే సింపుల్ గా ఈజీగా పల్లీల రైస్ ని తయారు చేసుకోండిలా?

Peanut Rice

Peanut Rice

పల్లీలు లేదా వేరుశెనగ విత్తనాలు.. వీటిని మనం ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాము. ప్రత్యేకించి ఈ వేరుశనగ విత్తనాలతో కొన్ని రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో పల్లీల రైస్ కూడా ఒకటి. చాలామంది ఇప్పటివరకు ఈ రెసిపీని ట్రై చేసి ఉండరు. ఈ రెసిపీ పేరును కొత్తగా వింటున్నా వారు కూడా చాలామంది ఉంటారు. మరి ఈ రెసిపీని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

వేరుసెనగపప్పు – పావు కప్పు
నువ్వులు – పావు కప్పు
ఎండు మిర్చి – నాలుగు
పచ్చి కొబ్బరి – పావు కప్పు
రైస్ – ఒక కప్పు
ఉప్పు – తగినంత
నూనె – పావు కప్పు
ఆవాలు – అర టేబుల్ స్పూన్
మినపప్పు – ఒక టేబుల్ స్పూన్
సెనగపప్పు – ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు – రెండు రెబ్బలు

తయారీ విధానం:

ఇందుకోం ముందుగా రైస్ వండేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో వేరుసెనగపప్పు వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి. ఆ తరువాత ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, నువ్వులు వేసుకుని మంచి సువాసన వచ్చేవరకు వేయించి, చల్లార్చుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ లో వేసి పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయి లో నూనె వేసి తాలింపు దినుసులు అన్నీ వేసి వేయించుకుని ఉడికించిన అన్నం, సాల్ట్, వేరుసెనగపప్పు పొడి వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే ఎంతో టెస్టిగా ఉండే పల్లిల రైస్ రెడీ.

Exit mobile version