Children: తల్లిదండ్రుల ప్రవర్తన వల్ల పిల్లలపై ప్రభావం చూపే అంశాలివే

  • Written By:
  • Updated On - May 25, 2024 / 12:15 AM IST

మీ బిడ్డ, ఇతరుల మధ్య పోలికలు తీసుకురావడం మంచిది కాదు.  ఇది చెడు  విషయాలలో ఒకటి. ఇది పిల్లల మనస్సుపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. దీనివల్ల తమలోని న్యూనతా భావంతో పాటు తాము ఎప్పటికీ బాగుండలేమన్న భావనను కూడా పెంచుకుంటారు. దీని కారణంగా ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఆత్మగౌరవం లేకుండా పోతారు. మీ పిల్లల భావోద్వేగ అవసరాలను విస్మరించడం వారిని మీ నుండి దూరం చేయడం లాంటిదే. ఇది వారి పిల్లలకు మానసిక ప్రభావానికి గురవుతారు.

పిల్లలను పదే పదే బతిమిలాడటం వల్ల వాళ్లలో.. కొన్నిసార్లు ఇది వారికి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లాగా మారుతుంది. ప్రతి పోటీలో గెలవాలని, ప్రతి పరీక్షలో మొదటి స్థానంలో రావాలని పిల్లలను ప్రేరేపించడం కూడా మంచి విషయం కాదు. అదే విధంగా ఒత్తిడి తీసుకురావడం కూడా సరైంది కాదు. దీని కోసం అతను కష్టపడి పనిచేస్తాడు, కానీ అతను ఫలితం పొందలేడు.

కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను తమ అభిప్రాయాలకు భిన్నంగా ఉండకూడదనే విధంగా పెంచుతారు. వారు అలా చేస్తే  మొండిగా, తిరుగుబాటుదారులుగా, అజ్ఞానులుగా  మారే అవకాశాలున్నాయి. కాబట్టి పిల్లల పెంపకం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.