Site icon HashtagU Telugu

Paramannam: పరవాన్నం.. ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే తయారు చేయండిలా?

Maxresdefault

Maxresdefault

మామూలుగా మనం దేవుళ్ళ కోసం ఎన్నో రకాల ప్రసాదాలను తయారు చేస్తూ ఉంటాము. అలా దేవుళ్ళకు తయారుచేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అటువంటి వాటిలో పరమాన్నం కూడా ఒకటి. దేవుళ్లకు ఎక్కువగా పరమాన్నం దద్దోజనం, పులిహోర వంటి నైవేద్యాలు ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు. అయితే పరమాన్నం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే తింటూ ఉంటారు. మరి అలాంటి ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఎంతో ఈజీగా ఎలా ట్రై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పరవాన్నం కావలసిన పదార్థాలు

బియ్యం – 1 కప్
పాలు – అర లీటర్
జీడిపప్పు – 15 గ్రాములు
నెయ్యి – 3 టీస్పూన్స్
బెల్లం – 150 గ్రాములు

పరవాన్నం తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా బియ్యం కడిగి దానిలో పాలు పోసి కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. తర్వాత విజిల్ తీసేసి అది కొంచెం వేడిగా వున్నప్పుడే బెల్లం వేసి కలుపుకోవాలి. ఒక గిన్నెలో స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకోవాలి. చివరిలో జీడిపప్పుతో డేకరేట్ చేసుకోవాలి. పరవాన్నం తినేముందు అందులో వేడిచేసిన నెయ్యి వేసుకుని తింటే చాలా బావుంటుంది. అంతే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెసిపీ రెడీ. చక్కగా ఈ రెసిపీ ని ఎప్పుడైనా తినడానికి లేదంటే దేవుళ్లకు నైవేద్యంగా కూడా పెట్టవచ్చు.