ఎండకు ముఖం నల్లగా అయ్యింది అని బాధపడుతున్న వారు బొప్పాయితో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ట్రై చేయాలని చెబుతున్నారు. మామూలుగా అప్పుడప్పుడు మనం ఎండకు అలా వెళ్లి వచ్చినపుడు ముఖం నల్లగా మారడం, డల్ గా కనిపించడం మనం గమనిస్తూనే ఉంటాం. కొన్ని కొన్ని సార్లు ముఖంపై మొటిమలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాటిని తగ్గించుకోవడానికి బొప్పాయి ఎంతో బాగా ఉపయోగపడుతుందట. మరి బొప్పాయితో ఏం చేయాలి అన్న విషయానికొస్తే.. ముఖంపై నల్లటి మచ్చలను తొలగించడానికి, ముఖాన్ని ప్రకాశవంతం చేయడానికి బొప్పాయి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను నివారించడానికి, నల్లటి మచ్చలు, డ్రైనెస్ ను తొలగించడానికి, ముఖం రంగును పెంచడానికి సహాయపడతాయట. మరి ఇందుకోసం బొప్పాయి ఎలా ఉపయోగించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాగా పండిన బొప్పాయిని ముక్కలుగా కోసి జ్యూస్ లా చేసుకోవాలి. ఇందులో ఒక టీస్పూన్ తేనెను వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఈ ప్యాక్ మీ చర్మం అందంగా మెరిసేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా అరకప్పు బొప్పాయిలో పేస్ట్ లో అర టీస్పూన్ పసుపును వేసి కలపి ఆ ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయడం వల్ల ఈ ప్యాక్ ముఖంపై నల్లటి మచ్చలు, మొటిమలను తొలగిపోతాయట.
అలాగే అరకప్పు బొప్పాయి గుజ్జులో 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసి బాగా కలిపి, తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని నీట్ గా కడిగేయాలట. ఈ ప్యాక్ ముఖం ఎరుపును తొలగించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. మరో ఫేస్ ప్యాక్ విషయానికి వస్తే.. బాగా పండిన బొప్పాయి ముక్కల్లో అరకప్పు ఆరెంజ్ జ్యూస్ ను పోసి మెత్తని పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖంపై ముడతలను తొలగించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.
అలాగే అరకప్పు బొప్పాయి ముక్కలను తీసుకుని పేస్ట్ గా చేసి అందులో ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసాన్ని వేసి బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేయడం వల్ల ముఖంపై ముడతలు తొలగిపోతాయట. మొటిమలు తగ్గాలి అనుకున్న వారు బొప్పాయి టమోటా జ్యూస్ ల మిశ్రమాన్ని సమానంగా తీసుకుని రెండింటిని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మొటిమలు దూరం అవుతాయని చెబుతున్నారు.