Papaya for Beauty: బొప్పాయిలో ఇది కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే చాలు నిగ నిగలాడే చర్మం మీ సొంతం?

మామూలుగా వయసు పెరిగే కొద్దీ ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు ముడతలు వంటివి వస్తూ ఉంటాయి. ఇక వాటిని తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్న

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 02:00 PM IST

మామూలుగా వయసు పెరిగే కొద్దీ ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు ముడతలు వంటివి వస్తూ ఉంటాయి. ఇక వాటిని తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ మొటిమలు మచ్చలు వంటివి రాకుండా ఉండాలి అంటే కొల్లాజెన్ అవసరం. ఈ కొల్లాజెన్ ను తీసుకోవడం వల్ల ఆ ముడతలు లేని అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. దీనిని వాడితే మీరు ఏ వయసులోనైనా అందంగా మారతారు. బొప్పాయిని సరిగ్గా వాడితే చర్మం అందంగా, మెరుస్తుంటుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో బొప్పాయి ముందుంటుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

వీటితో పాటు విటమిన్ సి, ఎ, బీటా కెరోటిన్‌లు కూడా ఉన్నాయి. బొప్పాయి లోని పోషకాలన్నీ ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని కాపాడతాయి. అలాగే, ఇది మొటిమలను, చర్మ సమస్యల్ని తగ్గిస్తాయి. ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మాన్ని మెరుగ్గా చేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా మారుస్తుంది. చర్మ మృతకణాలను తొలగించి హెల్ప్ చేస్తుంది. నల్ల మచ్చల్ని తగ్గిస్తుంది. అదే విధంగా, యూవి కిరణాల నుండి చర్మాన్ని కాపాడతాయి. కాబట్టి, చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. దీని కోసం బొప్పాయిని ఎలా వాడాలో తెలుసుకోండి. చర్మాన్ని యవ్వనంగా పెంచేందుకు పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్ వాడొచ్చు. దీనిని తయారు చేసేందుకు బొప్పాయి ముక్కల్ని తీసుకుని పులిసిన పెరుగు తీసుకుని అందులో కలిపి గుజ్జులా చేయాలి.

దీనిని ముఖానికి అప్లై చేయండి. తర్వాత తేలిగ్గా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత నీటితో క్లీన్ చేయండి. ఇలా వారానికి రెండు సార్లు పడుకునే ముందు చేయాలి. బొప్పాయి, బియ్యంపిండి కలిపి ఫేస్ ప్యాక్ రెడీ చేయండి. దీనిని చర్మానికి అప్లై చేయండి. ఈ రెండింటి కలయిక చర్మంలోని బ్లాక్ హెడ్స్‌ని క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు చర్మాన్ని టైట్ చేస్తుంది. అందుకోసం బొప్పాయిని గుజ్జులా చేయాలి అందులో బియ్యం పిండిని కలిపి ప్యాక్‌లా చేయండి. దీనిని ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. కేవలం ఫేస్‌ప్యాక్‌లా మాత్రమే కాదు. చర్మాన్ని వయ్వనంగా కాపాడుకోవచ్చు. రోజూ బొప్పాయి తింటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. బొప్పాయి పండుని రాత్రి తింటే చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు కూడా తగ్గుతుంది. బొప్పాయి తినేటప్పుడు పండిన దాన్ని ఎంచుకోవాలి. అదే విధంగా జ్యూస్‌లా కాకుండా పండుని తినడమే మంచిదని గుర్తుపెట్టుకోండి.