Papaya for Beauty: మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే బొప్పాయితో ఈ విధంగా చేయాల్సిందే?

మామూలుగా వయసు పెరిగే కొద్దీ చర్మం పై ముడతలు రావడం అన్నది సహజం. దాంతోపాటు కాలుష్య వాతావరణం రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లు ఉపయోగించడం

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 10:15 PM IST

మామూలుగా వయసు పెరిగే కొద్దీ చర్మం పై ముడతలు రావడం అన్నది సహజం. దాంతోపాటు కాలుష్య వాతావరణం రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లు ఉపయోగించడం వల్ల కూడా చర్మంపై ముడతలు వస్తూ ఉంటాయి. చాలామంది చర్మంపై ఉన్న మడతలను పోగొట్టుకోవడానికి అనేక వంటింటి చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా ఫలితం లభించగా దిగులు చెందుతూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ చిట్కా. బొప్పాయిని ఉపయోగించడం వల్ల చర్మం అందంగా మెరవడంతో పాటు మొహం పై ఉన్న మడతలు అన్ని తగ్గిపోతాయట. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో బొప్పాయి ముందుంటుంది.

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి, ఎ, బీటా కెరోటిన్‌లు కూడా ఉన్నాయి. బొప్పాయిలోని పోషకాలన్నీ ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని కాపాడతాయి. అలాగే, ఇది మొటిమలను, చర్మ సమస్యల్ని తగ్గిస్తాయి. ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మాన్ని మెరుగ్గా చేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా మారుస్తుంది. చర్మ మృత కణాలను తొలగించి హెల్ప్ చేస్తుంది. నల్ల మచ్చల్ని తగ్గిస్తుంది. అదే విధంగా, యూవి కిరణాల నుండి చర్మాన్ని కాపాడతాయి. కాబట్టి, చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. చర్మాన్ని యవ్వనంగా పెంచేందుకు పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్ వాడవచ్చు.

బొప్పాయి ముక్కల్ని తీసుకొని పులిసిన పెరుగు తీసుకుని అందులో కలిపి గుజ్జులా చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి తేలిగ్గా మసాజ్ చేయాలి. ఆపై 15 నిమిషాల తర్వాత నీటితో క్లీన్ చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు పడుకునే ముందు చేయాలి. అదేవిధంగా బొప్పాయి, బియ్యంపిం డి కలిపి ఫేస్ ప్యాక్ రెడీ చేయాలి. దీనిని చర్మానికి అప్లై చేయాలి. ఈ రెండింటి కలయిక చర్మంలోని బ్లాక్ హెడ్స్‌ని క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు చర్మాన్ని టైట్ చేస్తుంది. అందుకోసం బొప్పాయిని గుజ్జులా చేయాలి అందులో బియ్యం పిండిని కలిపి ప్యాక్‌లా చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారడంతో పాటు ముడతలు మాయమవుతాయి. రోజూ బొప్పాయి తింటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. బొప్పాయి పండుని రాత్రి తింటే చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు కూడా తగ్గుతారు..