నెమ్మదిగా ఎండలు మండిపోతున్నాయి. త్వరలోనే సమ్మర్ కూడా మొదలుకానుంది. సమ్మర్ మొదలయ్యింది అంటే చాలు చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా కూల్ కూల్ గా ఉండే చల్లటి జ్యూస్ లను తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే చాలామంది బయట దొరికే జ్యూస్ లు తాగడానికి ఎంతగా ఇష్టపడరు. అయితే సమ్మర్ లో ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో లస్సీ కూడా ఒకటి. అయితే ఎప్పుడైనా పంజాబీ లస్సి తాగారా. ఒకవేళ తాగకపోతే ఈ పంజాబీ లస్సీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పంజాబీ లస్సీకి కావలసిన పదార్థాలు :
పెరుగు – ఒకటిన్నర కప్పు
పంచదార – నాలుగు టేబుల్ స్పూన్లు, కుంకుమపువ్వు – కొద్దిగా
యాలకుల పొడి – పావు టీస్పూన్
ఐస్‌క్యూబ్స్ – కొన్ని
చల్లటి నీళ్లు – రెండు గ్లాసులు
పంజాబీ లస్సీ తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా పెరుగును మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తరువాత పంచదార, కుంకుమ పువ్వు రేకులు, యాలకుల పొడి వేయాలి. ఐస్‌క్యూబ్స్ వేసుకోవాలి. చల్లటి నీళ్లు కలపాలి. మరొక్కసారి బ్లెండ్ చేసుకోవాలి. గ్లాసుల్లో పోసుకుని సర్వ్ చేయాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పంజాబీ లస్సి రెడీ.