Site icon HashtagU Telugu

Paneer kobbari Recipe: ఎంతో టేస్టీగా ఉండే పనీర్ కొబ్బరి కూర.. ఇలా చేస్తే లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

Mixcollage 05 Dec 2023 08 30 Pm 8739

Mixcollage 05 Dec 2023 08 30 Pm 8739

మామూలుగా మనం ఇంట్లో తయారు చేసే వంటలకు అలాగే రెస్టారెంట్ లో తయారు చేసే వంటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కొంతమంది ఇంట్లో చేసే వాటిని ఇష్టపడితే మరి కొంతమంది హోటల్ రెస్టారెంట్ ఫుడ్ లనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ శాతం మంది హోటల్ రెస్టారెంట్ లలో దొరికే ఫుడ్లను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో పన్నీర్ కొబ్బరి కూర ఒకటి. మరి ఈ రెసిపీని ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పనీర్ కొబ్బరి కూరకి కావాల్సిన పదార్దాలు :

పనీర్ – 200 గ్రా
ఉల్లిపాయలు – నాలుగు
టమాటాలు – నాలుగు
అల్లంవెల్లుల్లి ముద్ద – చెంచా
పచ్చిమిర్చి – మూడు
పసుపు – చిటికెడు
ఉప్పు, కారం – తగినంత
కొబ్బరి పాలు – కప్పు
జీలకర్ర – ఒక చెంచా
ధనియాల పొడి – ఒక చెంచా
వేరుశెనగల పొడి – మూడు చెంచాలు
నూనె – తగినంత
కొత్తిమీర – కొద్దిగా

పనీర్ కొబ్బరి కూర తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా ఒక పాత్రలో నీళ్ళు తీసుకుని అందులో పన్నీర్ , ఉప్పు వేసి ఉడికించి, చల్లారక నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత టమాటో ప్యూరి తయారు చేసుకోవాలి, రెండు ఉల్లిపాయల్ని మెత్తగా పేస్టులా చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లి ముద్ద, టమాటో గుజ్జు కలపాలి. నూనె పైకి తేలాక ధనియాల పొడి, శెనగపొడి, కొబ్బరి పాలు, పచ్చిమిర్చి ముక్కలు, కప్పు నీళ్ళు వేసి మూతపెట్టాలి. గ్రేవి తయారయ్యాక ఉడికించి పెట్టుకున్న పనీర్ ముక్కలు వేసి ఐదు నిముషాలు స్టవ్ మీద ఉంచాలి. చివరిగా కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే పన్నీర్ కొబ్బరి కూర రెడీ.