Site icon HashtagU Telugu

Paneer Fried Rice: రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రైడ్ రైస్.. ఇంట్లోనే చేసుకోండిలా?

Mixcollage 11 Dec 2023 09 01 Pm 2971

Mixcollage 11 Dec 2023 09 01 Pm 2971

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇంట్లో చేసిన వంటకాలు కంటే బయట చేసిన వంటకాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫ్రైడ్ రైస్ లాంటివి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎగ్ రైస్ టమోటా రైస్,జీరా రైస్, బగారా రైస్, గోబీ రైస్ లాంటి ఫాస్ట్ ఫుడ్లకు ఎక్కువగా అలవాటు పడిపోయారు. దాంతో ఇంట్లో మంచి మంచి వంటకాలు చేసినా కూడా వాటిని తినడానికి ఇష్టపడడం లేదు. అయితే చాలామంది రెస్టారెంట్ చేసిన విధంగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. మరి రెస్టారెంట్ స్టైల్ లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

పనీర్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్ధాలు:

పనీర్ – 200 గ్రా
కారం – రెండు టేబుల్ స్పూన్స్
టమాటో సాస్ – ఒక టీ స్పూన్
నూనె – రెండు టీ స్పూన్స్
బాస్మతి రైస్ – ఒక కప్పు
నూనె – రెండు టేబుల్ స్పూన్స్
ఉప్పు – తగినంత
నల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్
క్యారెట్ తరుగు – పావు కప్పు
బీన్స్ తరుగు – పావు కప్పు
లైట్ సోయా సాస్ – ఒక టీ స్పూన్
ఉల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్స్

పనీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం:

ముందుగా రైస్ వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత పనీర్ వేసి అందులో కారం, టొమాటో సాస్ వేసి 2 నిమిషాలు టాస్ చేసి పనీర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి అందులో కేరట్, బీన్స్ తరుగు వేసి హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం వేయించుకోవాలి. నిమిషం తరువాత రైస్ తో పాటు మిగిలిన పదార్ధాలు అన్నీ వేసి ఒక నిమిషం వేపుకోవాలి. చివరగా ఉల్లికాడల తరుగు వేసి కలిపి దింపేసుకుంటే పనీర్ ఫ్రైడ్ రైస్ రెడీ.

Exit mobile version