Paneer Fried Rice: ఎంతో స్పైసీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ను సింపుల్ గా టేస్టీగా తయారు చేసుకోండిలా?

మామూలుగా పన్నీర్ ను మనం ఎన్నో రకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో భారతీయ వంటకాలలో ఈ పన్నీర్ వాడకం విపరీతంగా పెరి

  • Written By:
  • Publish Date - February 11, 2024 / 09:10 PM IST

మామూలుగా పన్నీర్ ను మనం ఎన్నో రకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో భారతీయ వంటకాలలో ఈ పన్నీర్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఎప్పుడైనా మీరు ప్రత్యేకించి పన్నీర్ తో తయారు చేసిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ తిన్నారా. ఒకవేళ తినకపోతే సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పనీర్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్ధాలు:

పనీర్ – 200 గ్రా
కారం – రెండు టేబుల్ స్పూన్స్
టమాటో సాస్ – ఒక టీ స్పూన్
నూనె – రెండు టీ స్పూన్స్
బాస్మతి రైస్ – ఒక కప్పు
నూనె – రెండు టేబుల్ స్పూన్స్
ఉప్పు – తగినంత
నల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్
క్యారెట్ సన్నని తరుగు – పావు కప్పు
బీన్స్ సన్నని తరుగు – పావు కప్పు
లైట్ సోయా సాస్ – ఒక టీ స్పూన్
ఉల్లి కాడల తరుగు – రెండు టేబుల్ స్పూన్స్

పనీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా రైస్ వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి నూనెలో పనీర్ వేసి అందులో కారం, టొమాటో సాస్ వేసి 2 నిమిషాలు టాస్ చేసి పనీర్ పక్కన పెట్టుకోవాలి. మరి కొద్దిగా నూనె వేసి అందులో కేరట్, బీన్స్ తరుగు వేసి హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం వేపుకోవాలి. నిమిషం తరువాత రైస్ తో పాటు మిగిలిన పదార్ధాలు అన్నీ వేసి ఒక నిమిషం వేపుకోవాలి. చివరగా ఉల్లికాడల తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ.