Palmistry: జ్యోతిష్య శాస్త్రంలో లాగానే ఒక వ్యక్తి జాతకాన్ని చూసి అతని వ్యక్తిత్వం, వైవాహిక జీవితం, దాంపత్యం, ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా హస్తసాముద్రికంలో (Palmistry) ఒక వ్యక్తి మొత్తం జీవితాన్ని అతని అరచేతులపై ఉన్న గీతలను చూడటం ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఒక వ్యక్తి వృత్తి, సంపద గురించి సమాచారాన్ని కనుగొనవచ్చు. ఇక్కడ మనం అరచేతిలో శని రేఖ గురించి మాట్లాడబోతున్నాం. దీనిని విధి రేఖ అని కూడా అంటారు. అదృష్టవంతులు మాత్రమే వారి చేతుల్లో అటువంటి గీతలు, గుర్తులను కలిగి ఉంటారు. ఇది వారిని ధనవంతులుగా, అపారమైన సంపదకు యజమానులను చేస్తుంది. ఈ వ్యక్తులపై శని దేవుడి ప్రత్యేక ఆశీస్సుల ఉంటాయి. అరచేతిలో ఈ రేఖ ఎక్కడ ఉంటుంది? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
అరచేతిలో శని రేఖ ఎక్కడ ఉంటుందంటే?
అత్యంత ముఖ్యమైన విధి రేఖ ప్రతి వ్యక్తి అరచేతిలో ఉంటుంది. దీనిని శని రేఖ అని కూడా అంటారు. ఈ రేఖ మణికట్టు లేదా చేతి మధ్య భాగం నుండి మొదలై శని పర్వతం వద్ద ముగుస్తుంది. అరచేతిలో శని పర్వతం మధ్య వేలు క్రింద ఉంటుంది.
చాలా సంపద రావచ్చు?
హస్తసాముద్రికం ప్రకారం.. ఒక వ్యక్తి అరచేతిలో శని లేదా విధి రేఖ మణికట్టు పై భాగం నుండి ఉద్భవించి కోత పడకుండా నేరుగా శని గ్రహానికి చేరినట్లయితే అది చాలా శుభప్రదమని అర్థం చేసుకోవాలి. అలాంటి వారు ధనవంతులు అవుతారు. ఇలాంటి వారికి జీవితంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. వారు తక్కువ శ్రమతో చాలా పొందుతారు. వారు చాలా క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడతారు. ఈ వ్యక్తులు అదృష్టం కంటే శ్రమను ఎక్కువగా నమ్ముతారు.
ఒక వ్యక్తి చేతిలో అదృష్టం, చంద్రరేఖ కలిసి ఉంటే గౌరవం లభిస్తుంది. శని పర్వతం చేరితే అలాంటి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. అంతేకాకుండా అలాంటి వ్యక్తులు జీవితంలో భౌతిక ఆనందాన్ని పొందుతారు. హస్తసాముద్రికం ప్రకారం.. శని పర్వతంపై చేప లేదా త్రిభుజం వంటి గుర్తు ఉంటే ఆ వ్యక్తి జీవితంలో సంపద, ఆస్తికి యజమాని అవుతాడు. అలాంటి వారు జీవితంలో కష్టపడి డబ్బు సంపాదిస్తారు. ఈ వ్యక్తులు జీవితంలో చాలా కష్టపడి పని చేస్తారు. వీరికి సోమరితనం నచ్చదు.