Palakura Pachadi: ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పచ్చడి.. సింపుల్ గా ట్రై చేయండిలా?

మన వంటింట్లో దొరికే ఆకుకూరల్లో ఒకటైన పాలకూరను చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పాలకూరను చాలా రకాల రెసిపీలలో ఉపయోగిస్తూ ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
Maxresdefault

Maxresdefault

మన వంటింట్లో దొరికే ఆకుకూరల్లో ఒకటైన పాలకూరను చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పాలకూరను చాలా రకాల రెసిపీలలో ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ పాలకూరతో చాలా తక్కువ రెసిపీలు ట్రై చేస్తూ ఉంటారు.. అటువంటి వాటిలో పాలకూర పచ్చడి కూడా ఒకటి. చాలామంది పాలకూర పచ్చడి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఆ రెసిపీని ఎలా చేయాలో తెలియక మౌనంగా ఉండి పోతూ ఉంటారు.. మరి పాలకూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పాలకూర పచ్చడి కావలసిన పదార్థాలు

పాలకూర – 2 పెద్ద కట్టలు
ఉల్లిపాయ – 1
చింతపండు – కొంచెం
ధనియాలు – 1 టీస్పూన్
మినపప్పు – 1 టీస్పూన్
ఆవాలు – ​1/4 టీస్పూన్
జీలకర్ర – 1/4 టీస్పూన్
ఎండు మిరపకాయలు – 6
పసుపు – చిటికెడు
మెంతులు – 3 లేక 4 టీస్పూన్స్
ఉప్పు – సరిపడినంత
నూనె – 6 టీస్పూన్స్

పాలకూర పచ్చడి తయారీ విధానం:

ఇందుకోసం మొదట పాలకూరను కాడలు తీసేసి శుభ్రం చేసి కట్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని దానిలో 5 టీస్పూన్ల నూనె వేసి, వేడెక్కిన తరువాత ధనియాలు, మినపప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకూ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే పాన్ లో పాలకూర, చింతపండు, పసుపు వేసి చిన్న మంట మీద 5 నిముషాలు వేయించుకోవాలి. పాలకూర ఉడికేవరకు అప్పుడప్పుడూ కలుపుతూ ఉండాలి. ఎప్పుడయితే పాలకూర లైట్ గ్రీన్ కలర్ వస్తుందో అప్పుడు తీసి ప్రక్కన పెట్టుకోవాలి. మిక్సీ లో మొదట వేయించుకున్న వాటిని వేసి గ్రైండ్ చేసి పొడి అయ్యిన తరువాత, పాలకూరను కూడా వేసి పేస్టు చేసి చివరగా ఉల్లిపాయ ముక్కలువేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయ్యిన పేస్టులో ఉప్పు కలిపి ఆ పేస్టుని తీసి ప్రక్కన పెట్టుకోవాలి. అంతే పాలకూర పచ్చడి రెడీ.

  Last Updated: 12 Dec 2023, 06:02 PM IST