Site icon HashtagU Telugu

Beauty Tips: పెదాలు కంటి చుట్టూ నలుపు సమస్య ఇబ్బంది పెడుతుందా.. అయితే వెంటనే ఇలా చేయండి?

Mixcollage 30 Jan 2024 04 11 Pm 911

Mixcollage 30 Jan 2024 04 11 Pm 911

ముఖం అందంగా కనిపించాలి అంటే కళ్ళు పెదాలు అందంగా ఆకర్షణీయంగా ఉండాలి. కానీ చాలామందికి కంటి కింద నల్లని వలయాలు పెదవి చుట్టూ నల్లటి వలయంలో ఏర్పడి చూడడానికి చాలా అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లభించగా దిగులు చెందుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే కళ్ళ చుట్టూ నల్లని వలయాలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.

అందులో సరిగ్గా నిద్రలేకపోవడం, వల్ల కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. మన కళ్ళ చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే, కెమికల్స్ ఉన్న క్రీమ్స్ వాడకపోవడమే మంచిది. అదేవిధంగా, ఎక్కువగా ఒత్తిడి, కెమికల్స్‌ కి ఎక్స్‌పోజ్ అవ్వడం కూడా కంటి చుట్టూ నల్లని వలయాలు రావడానికి కారణం. అలాగే పెదాలు నల్లబడడానికి మన అలవాట్లే కారణం. ఎక్కువగా పొగత్రాగడం వల్ల వస్తాయి. అదే విధంగా, ఎక్కువగా టీ తాగినా పెదాలు నల్లగా మారతాయి. వీటితో పాటు పెదాలను ఎప్పటికీ లాలాజలంతో తడపడం వల్ల కూడా సమస్య వస్తుంది.

లాలాజలం పెదాలపై పొడిబారడం వల్ల త్వరగా నల్లగా మారతాయి. అంతే కాకుండా, లిప్ స్టిక్, లిప్ బామ్ ఎక్కువగా వాడడం వల్ల పెదాలు నల్లగా మారతాయి. ఇది కాకుండా, పెదాలు కొరకడం, అనేక సమస్యలు రావడానికి పెదవులు రంగు మారడానికి కారణమవుతాయి. ఈ రెండు సమస్యల్ని కూడా మీరు ఒకే ఒక్క ఇంటి చిట్కాతో దూరమవుతుంది. దీని వల్ల కంటి చుట్టూ నల్లని వలయాలని దూరం చేయడం, పెదాలకి రంగు ఇవ్వడాన్ని హెల్ప్ చేస్తుంది. బీట్రూట్‌, పాలు ఈ రెండు పదార్థాలని కలిపి సమస్యని దూరం చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌ తయారు చేయడానికి ముందుగా బీట్‌రూట్‌ని పేస్టులా చేయాలి. అందులో అర టీ స్పూన్ పాలు వేసి బాగా కలపాలి.

దీనిని కళ్ళ చుట్టూ అప్లై చేయాలి. పొడిగా మారాక సాధారణ నీటితో కడగాలి. ప్రతి రెండు వారాలకి ఒకసారి ఇలా చేయడం మంచిది. అదే విధంగా పెదాలకి ఈ మిశ్రమాన్ని అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. కొద్దిగా ఆరాక దీనిని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలు ఎర్రగా, అందంగా మారతాయి. ఈ ఒక్క ప్యాక్ మాత్రమే కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో పుష్కలంగా నీరు తాగాలి. రోజుకి కనీసం మూడు లీటర్ల నీరు తాగడం అవసరం. తగినంత నిద్ర పోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యల్ని దూరం కావచ్చు. మద్యపానం, ధూమపానాన్ని తగ్గించాలి. కళ్ళు, పెదాల చుట్టూ ఎప్పటికప్పుడు మసాజ్ చేయాలి.