Onions: ఎరుపు లేదా తెలుపు ఏ రంగు ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిది?

Onions: సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్న సామెతను మనం వింటూ ఉంటాం. ఉల్లిపాయలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే మనకు మార్కెట్ రెండు రకాల ఉల్లిపాయలు లభిస్తూ ఉంటాయి.

  • Written By:
  • Publish Date - October 23, 2022 / 09:30 AM IST

Onions: సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్న సామెతను మనం వింటూ ఉంటాం. ఉల్లిపాయలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే మనకు మార్కెట్ రెండు రకాల ఉల్లిపాయలు లభిస్తూ ఉంటాయి. అందులో ఒకటి తెల్లరంగు ఉల్లిపాయ మరొకటి ఎరుపు రంగు ఉల్లిపాయ. అయితే ఈ రెండు ఉల్లిపాయల్లో ఏది ఆరోగ్యానికి మంచిది అన్న ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది. అయితే చాలామంది ఉల్లిపాయను పచ్చిగా తినడానికి ఇష్టపడితే మరికొందరు కూరల్లో తినడానికి ఇష్టపడతారు.

అయితే తెల్ల ఉల్లిపాయ ఎర్ర ఉల్లిపాయల్లో ఏది ఎక్కువ ప్రయోజనాలు కలిగిఉంటుంది అన్న విషయానికి వస్తే..ఎర్ర ఉల్లిపాయ కంటే తెల్ల ఉల్లిపాయ ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటుందని అని నిపుణులు చెబుతున్నారు. కాగా తెల్ల ఉల్లిపాయలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి. ఈ తెల్ల ఉల్లిపాయలో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉండి,రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే తెల్ల ఉల్లిపాయ గుండెను ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతాయి. అదేవిధంగా తెల్ల ఉల్లిపాయ శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు శ్వాస సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.

అంతేకాకుండా చెవి,ముక్కు,కన్నుకూడా సంబంధించిన ఇన్ఫెక్షన్ల లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తెల్ల ఉల్లిపాయలు వాళ్లకి ఆల్కలీన్ స్వభావం ఉండి ఇది ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జుట్టు రాలడం లాంటి సమస్యలను తగ్గించి జుట్టు ఒత్తుగా నల్లగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ఎర్ర ఉల్లిగడ్డలో విటమిన్ బి6, సి, మాంగనీస్, ఫైబర్, చక్కెర, కార్భోహైడ్రేట్లు, లాంటి ముఖ్యమైన ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఎర్ర ఉల్లిపాయలో తెల్ల ఉల్లియాలో కంటే తక్కవ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి.