Site icon HashtagU Telugu

Pakoda Curry: ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పకోడీ కర్రీ.. సింపుల్ గా ట్రై చేయండిలా?

Mixcollage 17 Mar 2024 06 38 Pm 6137

Mixcollage 17 Mar 2024 06 38 Pm 6137

సాయంత్రం అయ్యింది అంటే చాలు వేడివేడిగా ఏవైనా స్నాక్స్ తినాలని అనుకుంటూ ఉంటారు. అయితే స్నాక్స్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి పకోడీ. అప్పటికప్పుడు వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ, మిర్చి బజ్జి, బంగాళదుంప పకోడీలు రకరకాలుగా చేసుకుని తింటూ ఉంటారు. అయితే ఎప్పుడూ ఉల్లిపాయ పకోడీ చేసుకుని తినడం అన్నది కామన్. ఇది ఎప్పుడైనా ఉల్లిపాయ పకోడీ కూర తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ సింపుల్ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

పకోడి – పావు కిలో
ఉల్లిపాయ – పెద్దది ఒకటి
పచ్చిమిర్చి – రెండు
ఆవాలు – అరస్పూను
జీలకర్ర – అరస్పూను
పసుపు – అరస్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
కరివేపాకులు – గుప్పెడు
టమోటాలు – రెండు
ఉప్పు – రుచికి సరిపడా
కారం – ఒక స్పూను
గరం మసాలా – అర స్పూను
ధనియాల పొడి – అర స్పూను
జీలకర్ర పొడి – అర స్పూను
నూనె – సరిపడినంత
కొత్తిమీర తరుగు – మూడు స్పూనులు

తయారీ విధానం :

అయితే ఇందుకోసం ముందుగా పకోడీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా వేసి చేస్తే ఉల్లిపాయ పకోడి అవుతుంది. మీకు నచ్చిన విధంగా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఉల్లిపాయని సన్నగా చిన్న ముక్కలుగా తరిగి నూనెలో వేయాలి. అలాగే పచ్చిమిర్చిని నిలువుగా కోసి వేయాలి. ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టుని వేయాలి. ఉల్లిపాయలు పూర్తిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. అందులోనే పసుపు, కారం వేసి వేయించాలి. టమోటా ప్యూరీ, ఉప్పు వేసి బాగా ఉడికించాలి. మూత పెడితే మిశ్రమం బాగా ఉడుకుతుంది.నూనె తేలే వరకు ఉడికించి అందులో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి,కరివేపాకులు వేసి ఉడికించాలి. గ్లాసు నీళ్లు పోసి అయిదు నిమిషాల పాటూ ఉడికించాలి. తరువాత ముందుగా చేసి పెట్టుకున్న పకోడి వేసి కలపాలి. పదినిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే పకోడీ కర్రీ రెడి.

Exit mobile version