Site icon HashtagU Telugu

Onion Juice: ఈ ఒక్క జ్యూస్ తో మీ జుట్టు సమస్యలు తగ్గి, గడ్డిలా గుబురు లాగా పెరగడం ఖాయం!

Onion Juice

Onion Juice

ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ఉల్లిని డైట్ లో భాగం చేసుకోమని చెబుతూ ఉంటారు. కాగా ఉల్లి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఉల్లి రసం జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంతో పాటు జుట్టు పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందట. చుండ్రు సమస్యతో బాధపడుతున్నట్లయితే ఉల్లి రసం ఉపయోగించవచ్చట. జుట్టు రాలే సమస్య నుంచి బయటపడడం కోసం ఉల్లిపాయ నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందట.

జుట్టు చిట్లిపోయి పొడిగా ఉన్నట్లయితే ఉల్లి నూనెను చుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట. ఉల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చుండ్రును నయం చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టుకు ఉల్లి రసాన్ని అప్లై చేయడం వల్ల జుట్టు మరింత మెరుస్తూ, మృదువుగా మారుతుంది. షాంపూ చేయడానికి ముందు ఉల్లి రసాన్ని జుట్టుకు అప్లై చేస్తే తలకు రక్త ప్రసరణ పెరిగి జుట్టు రాలడాన్ని నివారిస్తుందట. జుట్టును ఒత్తుగా మార్చడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు జుట్టుకు ఉల్లి రసాన్ని అప్లై చేయడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టును నల్లగా మారుస్తాయట.

అయితే ముందుగా ఉల్లిపాయను మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. తర్వాత రసాన్ని వేరు చేయాలి. ఇందులో కొబ్బరి నూనె కలిపి 20 నిమిషాల పాటు మరిగించాలి. నూనె చల్లారిన తర్వాత జుట్టుకు బాగా అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈ విధంగా చేస్తే బాగా పొడవుగా పెరుగుతుందట. ఉల్లి నూనెను ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఈ రెమిడీ నీ వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట. మార్పుని మీరే గమనించవచ్చు అని చెబుతున్నారు..