Hair care: బెండకాయతో సిల్కీ పొడువాటి జుట్టు మీ సొంతం?

చాలామంది బెండకాయలను కేవలం కూరల్లో మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటూ ఉంటారు. బెండకాయ కేవలం కూరల్లో ఉపయోగించడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి, అం

  • Written By:
  • Publish Date - July 17, 2023 / 09:25 PM IST

చాలామంది బెండకాయలను కేవలం కూరల్లో మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటూ ఉంటారు. బెండకాయ కేవలం కూరల్లో ఉపయోగించడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి, అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జుట్టును సంరక్షించడంలో బెండకాయ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే జుట్టు సంరక్షించుకోవాలి అనుకునేవారు బెండకాయతో ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జుట్టు స్మూత్‌గా ఉండాలని చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటివారు ఈ ఎంబెండకాయ టిప్స్ ను పాటిస్తే సరి.

ఇందుకోసం ఎనిమిది బెండకాయలు నీళ్ళు, మొక్క జొన్న పిండి,కొబ్బరినూనె బాదం నూనె అన్నింటినీ ఒక టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. తరువాత బెండకాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమం మొత్తం చల్లారనివ్వాలి. నెక్స్ట్ మీరు మిక్సీ తీసుకొని బ్లెండ్ చేయండి. తర్వాత ఒక క్లాత్‌ని తీసుకుని వడగట్టాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి వేసి కొద్దిగా నీళ్ళు పోసి, ఆ తర్వాత బెండకాయ మిశ్రమాన్ని అందులో వేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఈ మిశ్రమాన్ని మరిగించుకోండి. చక్కగా మిశ్రమం వచ్చే వరకు మీరు దీనిని మరిగించుకోవాలి.

ఆ తర్వాత దీనిని చల్లారనిచ్చి, ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారాక కొబ్బరి నూనె బాదం నూనె వేయాలి. దీనిని అప్లై చేసుకునే ముందు కూడా కొన్ని రకాల చిట్కాలను పాటించాలి. ముందుగా జుట్టును చిక్కులు లేకుండా తీసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం అప్లై చేయాలి. ఇప్పుడు షవర్ క్యాప్ తలకి పెట్టుకొని రెండు గంటల పాటు అలా ఉండండి. ఏదైనా షాంపూ అప్లై చేసుకుంటూ మీ జుట్టుని వాష్ చేయండి. మీరు వారానికి రెండు సార్లు ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. ఇలా ఫాలో అవ్వడం వల్ల మీ జుట్టు స్ట్రైట్‌గా ఉంటుంది. సిల్కీగా ఉంటుంది. అంతే కాకుండా మీ జుట్టు బలంగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ సమస్యతో బాధ పడే వాళ్ళు కూడా ఈ చిట్కా ఫాలో అవ్వొచ్చు. చిన్నగా బట్టతల వచ్చిన వాళ్లు కూడా ఈ పద్ధతిని ఫాలో అవ్వచ్చు. దానితో జుట్టు వస్తుంది. నిజంగా ఇది చాలా బాగా పని చేస్తుంది కావాలంటే ఒక సారి ప్రయత్నించి చూడండి.