Oats Pakoda: కరకరలాడే ఓట్స్ పకోడి.. ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా?

ప్రస్తుతం చలికాలం కావడంతో వాతావరణం ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది.. ఈ చల్లటి వాతావరణంలో చాలామంది వేడివేడిగా ఏదైనా తినాలని అనుకుంటూ ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
Mixcollage 25 Dec 2023 06 47 Pm 3152

Mixcollage 25 Dec 2023 06 47 Pm 3152

ప్రస్తుతం చలికాలం కావడంతో వాతావరణం ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది.. ఈ చల్లటి వాతావరణంలో చాలామంది వేడివేడిగా ఏదైనా తినాలని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పకోడీ సమోసా టీ వంటివి ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎప్పుడు ఒకే విధమైన పకోడీ కాకుండా కొత్త కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో ఓట్స్ పకోడీ కూడా ఒకటి. ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా ట్రై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఓట్స్ పకోడికీ కావాల్సిన పదార్థాలు:

ఓట్స్ -1 కప్పు
శనగపిండి – పావు కప్పు
బియ్యంపిండి – పావు కప్పు
ఉప్పు – రుచికి సరిపడినంత
పచ్చిమిర్చి – 2 చిన్నగా తరిగినవి
కరివేపాకు – 1 రెమ్మ
కొత్తిమీర – కొద్దిగా
పసుపు – పావు టీస్పూన్
కారం -1 టీస్పూన్
గరం మసాలా – అరటీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీస్పూన్
ఉల్లిపాయలు – పొడవుగా తరిగినవి
జీడిపప్పు పలుకులు- కొద్దిగా
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా

ఓట్స్ పకోడి తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా ఒక బౌల్లోకి ఓట్స్ తీసుకొని వాటిపై నీళ్లు చల్లుకొని కలుపుకోవాలి. ఓట్స్ తడిసిన తర్వాత వాటిపై మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని పకోడీలా వేసుకోవాలి. వీటిని తక్కువ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఫ్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా కరకరలాడే ఓట్స్ పకోడీ రెడీ.

  Last Updated: 25 Dec 2023, 06:48 PM IST