Site icon HashtagU Telugu

Oats Edli: ఓట్స్‌ ఇడ్లీ ఇలా చేస్తే చాలు..లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

Mixcollage 06 Feb 2024 08 14 Pm 5270

Mixcollage 06 Feb 2024 08 14 Pm 5270

ఉదయం పూట చాలామంది టిఫిన్ గా ఇడ్లీని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఉదయంతో పాటు రాత్రి సమయంలో కూడా చాలామంది ఇడ్లీలు తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఎప్పుడూ ఒకే రకమైన ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఏవైనా కొత్త కొత్తగా ట్రై చేయాలి అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా ఓట్స్ ఇడ్లీ ట్రై చేసారా. ఒకవేళ ఇప్పుడు తినకపోతే ఈ రెసిపీ ని సింపుల్ గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఓట్స్‌ ఇడ్లీకి కావలసిన పదార్థాలు:

ఓట్స్‌ – ఒక కప్పు
రవ్వ – సగం కప్పు
పుల్ల పెరుగు – సగం కప్పు
క్యారట్‌ తురుము – సగం కప్పు, కొత్తిమీర, కరివేపాకు – సగం కప్పు
ఉప్పు – సరిపడా
నీరు – సరిపడా
నూనె – సరిపడా
పోపుదినుసులు – తగినంత
మిర్చి – రెండు
మిరియాల పొడి – సగం స్పూను
జీడిపప్పు – పది
అల్లం – చిన్న ముక్క

ఓట్స్‌ ఇడ్లీ తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా ఓట్స్‌ను మెత్తటి పిండిలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఒక బాణలిలో రవ్వ వేసి వేయించాలి. రవ్వ వేగాక ఓట్స్‌ పిండిని కూడా కలిపి అయిదు నిమిషాలు వేయించాలి. ఇది చల్లబడ్డాక క్యారట్‌ తురుము, వేయించిన జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, మిర్చి తరిగి వేయాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి, పెరుగు చేర్చి పోపు పెట్టాలి. ఈ మిశ్రమాన్నంతా బాగా కలపాలి. నీటిని కూడా కలిపి జారుగా కలియబెట్టి ఒక అయిదు నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లలో ఈ మిశ్రమాన్ని వేసి పదిహేను నిమిషాలు ఉడికించాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ ఇడ్లీ రెడీ.

Exit mobile version