మామూలుగా మనము గోధుమపిండితో తయారు చేసిన చపాతీలను ఎక్కువగా తింటూ ఉంటాం. కొందరు చపాతీలు మరింత క్రిస్పీగా టేస్టీగా రావాలి అని అందులోకి కొన్ని కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా కలుపుతూ ఉంటారు. బయట మనకు హోటల్స్ లో గోధుమపిండితో పాటు మైదా పిండిని కూడా కలిపి చపాతీలు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా ఓట్స్ చపాతి తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఓట్స్ చపాతీకి కావలసిన పదార్థాలు
ఓట్‌మీల్ పిండి – కప్పు
గోధుమపిండి – కప్పు
సెనగపిండి – కప్పు
మెంతిపొడి – అరటీస్పూను
నెయ్యి – తగినంత
ఉప్పు- తగినంత
జీలకర్ర పొడి – అరటీస్పూన్
ఓట్స్ చపాతీ తయారీ విధానం :
ముందుగా ఓట్స్ పిండి, గోధుమ పిండి, సెనగ పిండి అన్నింటినీ కలిపి అందులో ఉప్పు, జీలకర్ర, మెంతిపొడి రెండు స్పూన్ల నెయ్యి గోరువెచ్చని నీళ్ళు వేసి చపాతీలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక అర గంట నానిన తరువాత ఉండలు చేసుకుని చపాతీల్లా చేసి పెనం మీద కాల్చాలి. చివరలో చపాతీ మీద నెయ్యి రాసుకుంటే సరి అంతే ఓట్స్ చపాతి రెడీ.