Site icon HashtagU Telugu

Noodles Samosa: వెరైటీగా ఉండే నూడుల్స్‌ సమోసా ఎప్పుడైనా ట్రై చేశారా?

Mixcollage 30 Jan 2024 07 01 Pm 3858

Mixcollage 30 Jan 2024 07 01 Pm 3858

మామూలుగా చాలామందికి నూడుల్స్‌ అంటే చాలు ఇక ఇష్టపడుతూ ఉంటారు. నూడిల్స్ తో ఎలాంటి ఆహార పదార్థం తయారుచేసిన కూడా లొట్టలు వేసుకొని మరి తినేస్తూ ఉంటారు. అయితే నూడుల్స్‌ అంటే ఫ్రై ఒక్కటే కాదు. వాటితో సమోసాలు చేసుకోవచ్చు. ఏంటి నూడుల్స్‌ తో సమోసా నా అని ఆశ్చర్యపోతున్నారా. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ తినాలని అనుకుంటారు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే…

నూడుల్స్ సమోసా కు కావలసిన పదార్థాలు:

నూడుల్స్‌ ఉడికించినవి – ఒక బౌల్‌ నిండా
నూనె – సరిపడా
వెల్లుల్లి రెబ్బలు – రెండు
ఉల్లిపాయ – ఒకటి
క్యాప్సికం – ఒకటి
క్యారెట్‌ – ఒకటి
క్యాబేజీ తురుము – ఒక కప్పు
ఉప్పు – రుచికి తగినంత
సోయా సాస్‌ – రెండు టీ స్పూన్లు
వెనిగర్‌ – ఒక టేబుల్‌ స్పూన్‌
మైదా – రెండు కప్పులు
గోధుమపిండి – ఒక కప్పు
వాము – ఒక టీ స్పూన్‌
నీళ్లు – కొద్దిగా

నూడుల్స్ సమోసా తయారీ విధానం

స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత క్యారెట్‌ ముక్కలు, క్యాప్సికం, క్యాబేజీ తురుము వేసి మరికాసేపు వేగించుకోవాలి. తగినంత ఉప్పు వేసి, సోయాసాస్‌, వెనిగర్‌, ఉడికించిన నూడుల్స్‌ వేసి కలుపుకోవాలి. కాసేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్‌లో మైదా, గోధుమపిండి వేసి, తగినంత ఉప్పు, వాము, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ పిండిని అరగంటపాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతీల్లా చేసుకోవాలి. తరువాత సగానికి కట్‌ చేసుకోవాలి. ఆ భాగాన్ని మళ్లీ సగానికి కట్‌ చేయాలి. తరువాత ఒక భాగం తీసుకుని మధ్యలో నూడుల్స్‌ మిశ్రమం పెట్టి చివర్లు నూనె లేదా నీటితో అద్దుతూ మూసేయాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక సమోసాలు వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే నూడుల్స్‌ సమోసా రెడీ.