ప్రతి ఒక్కరు కూడా అందమైన చర్మాన్ని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అందంగా యవ్వనంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే అందంగా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలను పాటించాలట. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు కొన్ని చిట్కాలు పాటించాలట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలట. దీనివల్ల ముఖంపై ఉండే దుమ్ము, ధూళి, మలినాలు తొలగిపోతాయట. అలాగే చర్మ రంధ్రాలపై పేరుకున్న అదనపు నూనె కూడా తొలగిపోతుందట. ముఖం శుభ్రం చేయడానికి మీ చర్మానికి సరిపోయే క్లెన్సర్ ఉపయోగించాలని చెబుతున్నారు. అలాగే ముఖం కాంతిగా ఉండాలంటే ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవాలట ఇది మీ ముఖంపై ఉండే డెడ్ స్కిన్ తొలగించడానికి సహాయపడుతుందట. ఎక్స్‌ఫోలియేట్ చేసుకున్నప్పుడు మీ చర్మం మెరుస్తుందట. అయితే వారానికి రెండుసార్లు ఎక్స్‌ఫోలియేట్ చేసుకుంటే మీ చర్మం అందంగా ఉంటుందట.
క్లీనింగ్, ఎక్స్‌ఫోలియేట్ చేసుకున్న తర్వాత టోనర్ వాడటం చాలా ముఖ్యం. టోనర్ మీ చర్మం సహజ pH స్థాయిని కాపాడుతుందట. టోనర్ వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. చర్మ సమస్యల నివారణకు సీరం వాడాలట. చిన్న గీతలు, ముడతలు, అసమాన చర్మం టోన్ సమస్యను తొలగించడానికి సీరం సహాయపడుతుందని చెబుతున్నారు. రెటినాల్ లేదా విటమిన్ సి లాంటి పవర్ ఫుల్ సీరం వాడటం ఇంకా మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా చర్మం పొడిబారకుండా, తాజాగా కనిపించడానికి మాయిశ్చరైజర్ వాడాలి. మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల ముఖంపై గీతలు, ముడతలు తగ్గుతాయట. సహజ నూనెలు కలిగిన మాయిశ్చరైజర్ వాడటం చర్మ ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.