పెళ్లి (Narriage) అనేది జీవితంలో ఒక కొత్త అధ్యాయం. పెళ్లికి ముందు వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువగా ఉండొచ్చు, కానీ పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి జీవితాన్ని భాగస్వామ్యం చేసుకోవాలి. ఒకరి అలవాట్లు మరొకరికి కొత్తగా అనిపించవచ్చు. కాబట్టి, ఒకరికొకరు అర్థం చేసుకుని, అనువుగా మారడం చాలా అవసరం. మంచి సంబంధాన్ని కొనసాగించాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవడం, కొన్ని విషయాలను వదిలేయడం ఎంతో మంచిది. ఒప్పందాలు లేకుండా ప్రేమను పంచుకోవడం, ఒకరినొకరు గౌరవించడం, సహనంతో ముందుకు సాగడం బలమైన బంధానికి నాంది.
Good News : ఏపీలో పింఛన్‌లు తీసుకునేవారికి అదిరిపోయే న్యూస్
కొంతమంది చిన్న విషయాలపై విమర్శించడం, ఎగతాళి చేయడం అలవాటుగా చేసుకుంటారు. ఇది పెళ్లి తర్వాత కొనసాగితే దాంపత్య బంధంలో ఒడిదుడుకులు తథ్యం. జీవిత భాగస్వామిని ఎప్పుడూ గౌరవంగా చూసుకోవాలి. అతని లేదా ఆమెలోని తప్పులను ఎత్తిచూపే ముందు, అవి నిజంగా తప్పులా? లేక మన అంచనాలను తగిన విధంగా మార్చుకోవాలా? అనే విషయాన్ని ఆలోచించాలి. మితిమీరిన విమర్శలు, అర్థంలేని తిట్లు పెళ్లి బంధాన్ని దెబ్బతీస్తాయి. అందుకే భాగస్వామిని అర్థం చేసుకోవడం, అతనికి/ఆమెకు మద్దతుగా ఉండడం చాలా ముఖ్యం.
Vijayawada : విజయవాడ వెస్ట్ బైపాస్ భూముల ధరలకు రెక్కలు..ఎందుకంటే !
పెళ్లి తర్వాత ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం మానేయాలి. జీవితంలో ప్రతి చిన్న విషయంలోనూ భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకుంటే, అనుబంధం మరింత బలపడుతుంది. కలిసి గడిపే సమయాన్ని మధురంగా మార్చుకోవాలి. సహనం, ప్రేమ, విశ్వాసం ఉంటే దాంపత్య జీవితం ఆనందకరంగా మారుతుంది. చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటేనే, కొత్త జీవితం మధురమైన ప్రయాణమవుతుంది.