Entrepreneurs : 2023లో ఎంటర్ ప్రెన్యూర్స్ నేర్చుకోవాల్సిన, అలవర్చుకోవాల్సిన కొత్త విషయాలు

షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా ఎంటర్ ప్రెన్యూర్ గా ఉన్నవారు.. ప్రతి పనికి సరైన సమయాన్ని (Time) కేటాయించాల్సిన అవసరం ఉంటుంది.

షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా ఎంటర్ ప్రెన్యూర్ (Entrepreneurs) గా ఉన్నవారు.. ప్రతి పనికి సరైన సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. సమర్థవంతమైన మరియు ఉత్పాదక వ్యాపారంతో కొత్త సంవత్సరానికి శ్రీకారం చుట్టడానికి ఎంటర్‌ ప్రెన్యూర్స్ (Entrepreneurs) కు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో చెబుతున్నారు.

మల్టీ టాస్కింగ్:

  • బిజీ వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలు సజావుగా సాగేలా చూసుకోవడానికి సమర్థవంతమైన సమయ నిర్వహణ అనేది చాలా ముఖ్యం. టైం మేనేజ్మెంట్ చేసుకోవడం గొప్ప నైపుణ్యం.
  • సిద్ధం చేసుకునే వ్యాపార  ప్రణాళికలు, వ్యూహాలను అమలు చేయడం దగ్గరి నుంచి మొదలుపెడితే.. ఉద్యోగులను నిర్వహించడం, సమావేశాలకు అధ్యక్షత వహించడం, కొత్త క్లయింట్‌లను పొందడం వరకు అన్నింటినీ ఎంటర్‌ప్రెన్యూర్స్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇలాంటి విభిన్న పాత్రలను పోషిస్తూ ఒత్తిడిని జయిస్తూ ముందుకు సాగాలి.
  • ఇవన్నీ కలిపి మేనేజ్ చేసే స్కిల్ ను ” మల్టీ టాస్కింగ్ ” అని అంటారు. అందుకే చాలామంది మేనేజ్మెంట్ పండితులు.. ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే వాడికి ” మల్టీ టాస్కింగ్ ” ఎబిలిటీ ఉండాలని బలంగా చెబుతుంటారు.
  • మల్టీ టాస్కింగ్ కు టైం మేనేజ్మెంట్ తోడైతే ఇక విజయాలే వరిస్తాయని అంటుంటారు.
  • సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకునే క్రమంలో డిజిటల్ సాధనాలను, ఆధునిక సాంకేతికతను వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎంటర్‌ ప్రెన్యూర్స్ (Entrepreneurs) కు చిట్కాలు:

  • సంస్థాగత కార్యకలాపాలను ఆటోమేట్ చేసే సాఫ్ట్‌వేర్‌ను ఎంచుకోవాలి. దాని ద్వారా కార్యకలాపాలు పర్యవేక్షించాలి.
  • బహుళ పనులను పూర్తి చేయడానికి ఉత్తమ మార్గం ఒకేసారి ఒక పనిపై దృష్టి పెట్టడం.
  • ముఖ్య లక్ష్యాలను జాబితా చేయడంపై దృష్టి సారించి.. సాధారణ రోజువారీ, వారపు ప్రణాళికను రూపొందించుకోవాలి.
  • ప్రణాళిక లేని సమావేశాలు లేదా షెడ్యూల్ చేయని కాల్‌ల కోసం నిర్దిష్ట సమయం కంటే ఎక్కువ సమయం వెచ్చించకుండా చూసుకోండి.
  • మెరుగైన సమయ నిర్వహణ అనేది మీ షెడ్యూల్‌ను సమర్ధవంతంగా నియంత్రించడానికి దోహదం చేస్తుంది.

Also Read:  Corona : మీ దగ్గు, జలుబు కరోనా కొత్త వేరియంట్ వల్లా ? కాదా ? ఇలా తెలుసుకోండి