Nightmares Vs Health Problems : మీకు రాత్రి టైంలో పీడకలలు ఎక్కువగా వస్తున్నాయా ? ఇలా ఎక్కువగా పీడకలలు వచ్చే వారిపై బ్రిటన్ కు చెందిన బర్మింగ్ హామ్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన తాజా రీసెర్చ్ లో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. పీడకలలు వెల్లువలా ముంచెత్తే వారికి మతిమరుపు (Amnesia) వంటి ఆరోగ్య సమస్యలు ముసురుకునే ముప్పు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పీడకలలు వచ్చేవారు ఏదైనా టాపిక్ గురించి శ్రద్ధగా విన్నా.. దాన్ని పర్ఫెక్ట్ గా గుర్తుంచుకోవడంలో తడబడుతుంటారని పేర్కొన్నారు. 35 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు కలిగిన దాదాపు 2,600 మందిపై జరిపిన అధ్యయనంలో ఈవివరాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. పీడకలలు వచ్చేవారు మానసిక వైద్యులను సంప్రదించాలని సూచించారు. ‘‘కలలు అందరికీ వస్తాయి. కానీ పీడకలలు అందరికీ రావు. సాధారణ కలల వల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ పీడకలల వల్ల చాలా ప్రమాదం. పీడకలలు ఆడవారి కన్నా మగవారిలోనే ఎక్కువగా వస్తుంటాయి’’ అని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
స్లీప్ ఆప్నియా, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్, నార్కోలెప్సీ వంటి నిద్రలేమి సమస్యల వల్ల కూడా పీడకలలు వస్తుంటాయని సైంటిస్టులు తెలిపారు. స్లీప్ అప్నియా వల్ల నిద్రలో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. సరిగ్గా అలాంటి టైంలోనే పీడకలలు ఎక్కువగా వస్తుంటాయని రీసెర్చ్ రిపోర్టులో విశ్లేషించారు. పీడకలలు, డిమెన్షియా మధ్య ఉండే రిలేషన్ షిప్ ఏమిటి ? అనేది తెలుసుకోవడానికి లోతైన రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. యాంటీ డిప్రెసెంట్లు వాడే వారికి కూడా పీడకలలు వచ్చే రిస్క్ అధికంగానే ఉంటుందని పేర్కొన్నారు. ట్రామా, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి జబ్బుల బారిన వారికి కూడా పీడకలలు వస్తుంటాయని పరిశోధకులు (Nightmares Vs Health Problems) చెప్పారు.
Also Read: Robberies – Dussehra : దసరాకు ఊరెళ్తున్నారా ? హోం సేఫ్టీ కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి !
గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ, మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.