అందంగా ఉండాలి.. ఫ్యాషన్‌గా కనిపించాలి అని ఎవరికి మాత్రం ఉండదు!! వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఈ ఆలోచన ఉంటుంది. 2022లో వోల్ఫ్ కట్ అతిపెద్ద బ్యూటీ ట్రెండ్‌గా నిలిచింది.ఇక ఈ 2023 సంవత్సరం సరికొత్త రంగులు, నూతన కట్‌లతో కూడిన నాస్టాల్జిక్ హెయిర్‌స్టైల్‌లకు వేదికగా నిలువనుంది.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* Box Bobs
Box Bobs హెయిర్‌స్టైల్ ఎప్పటికీ ఒక క్లాసిక్. గతంలో దీనికి అంతగా ప్రజాదరణ లేదు. కానీ ఈ ఏడాది అది మంచి ఫాలోయింగ్ ను పొందే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఎంతోమంది సెలిబ్రిటీలు ఈ హెయిర్ స్టైల్ తో షైన్ అయ్యారు. అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. క్లాసిక్ రకం బాబ్ హెయిర్ స్టైల్ అనేది చక్కటి జుట్టు కోసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్ట్రెయిట్‌గా హెయిర్ ను మలచుకొని ఈ కటింగ్ చేయించుకుంటే లుక్ లో బ్యూటీ మరింత ఇనుమడిస్తుంది.
* Zigzag parting
1990లలో ఈ హెయిర్‌స్టైల్ కు ఎంతో క్రేజ్ ఉండేది. అప్పట్లో జెన్నిఫర్ అనిస్టన్ వంటి ఎందరో ప్రముఖులు ఈ హెయిర్ స్టైల్ వాడేవారు. Zigzag parting హెయిర్ స్టైల్ లో గుమిగూడిన మడతలు జుట్టుకు అట్రాక్షన్ ఇస్తాయి. మన ముఖ లక్షణాలను మరింత బాగా బయటకు కనిపించేలా చేస్తాయి.
* Tresses
tresses అనేది జుట్టుతో చిన్న చిన్న చిన్న జెడలు అల్లే హెయిర్ స్టైల్. దట్టమైన వెంట్రుకలు, జుట్టు ఉన్నవారికి ఇది ఎంతో బాగా పనికొస్తుంది. తలపై చిన్న చిన్న జడల అల్లిక వల్ల ఈ హెయిర్ స్టైల్ చేయించుకున్న వాళ్ళు స్పెషల్ గా కనిపిస్తారు.
* Butterfly cut
మీ జుట్టు పొడవుగా లేదా పొట్టిగా ఉన్నా బెంగ లేదు. వయస్సుతో సంబంధం లేకుండా Butterfly cut అందరిపై పని చేసే అవకాశం ఉంటుంది. ఇది అందంగా కనిపిస్తుంది. మీ హెయిర్‌స్టైల్ లుక్‌కి గ్లామర్ ను జోడిస్తుంది. మిగిలిన అన్ని హెయిర్ స్టైల్ లకు ధీటుగా ఇది కనిపిస్తుంది. 1990లలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది.
* Pixie
Box Bobs మరియు Pixie హెయిర్ కట్ల సమ్మేళనం పిక్సీ కట్. ఇందులో బాబ్ హెయిర్ కట్ కంటే పొట్టిగా జుట్టు కనిపిస్తుంది. కానీ ఇందులో జుట్టు సైజు పిక్సీ కట్ కంటే కొంచెం పెద్దగానే ఉంటుంది. స్ట్రెయిట్ హెయిర్, ఉంగరాల జుట్టు ఈ రెండింటిపైన కూడా ఇది అద్భుతంగా పని చేస్తుంది.