Site icon HashtagU Telugu

How to remove wrinkles: ముఖంపై ముడతలు తగ్గిపోవాలంటే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే?

Mixcollage 13 Feb 2024 07 09 Pm 6204

Mixcollage 13 Feb 2024 07 09 Pm 6204

మామూలుగా వయసు మీద పడేకొద్ది ముఖంపై మొటిమలు రావడం అన్నది సహజం. కానీ ఈ మధ్యకాలంలో చిన్న వయసు వారికే ముఖంపై ముడతల సమస్యలు మొదలవుతున్నాయి. అయితే ఈ ముడతలు తగ్గించుకోవడానికి చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వేలకు వేలు డబ్బులు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించవు. అప్పుడు కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వడం వల్ల ఈ ముఖంపై మడతల సమస్యలను తగ్గించుకోవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

తేనె న్యాచురల్‌ హ్యూమెక్టెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంలో తేమను నిలిచేలా సహాయపడుతుంది. తేనెలోని యాంటీఆక్సిడెంట్‌ గుణాలు ఫ్రీరాడికల్స్‌ నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి. చర్మంపై త్వరగా ముడతలు పడకుండా కాపాడతాయి. మీరు ముడతలను నివారించాడానికి తేనెను ముఖానికి అప్లై చేయండి. దీన్ని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గుతాయి. అలాగే కలబంద కొలాజెన్‌ను విడుదల చేసి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది, దానివల్ల చర్మం తేమగా ఉంటుంది. దీంతో చర్మం మీద ముడతలు, గీతలు తగ్గుతాయి. కలబందలో ఓదార్పు, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. కలబదం గుజ్జును తరచు ముఖానికి అప్లై చేసుకుంటే హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తుంది. ఇది ముడతలు, ఫైన్‌లైన్స్‌ను తగ్గిస్తుంది.

కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి పోషణ అందించడానికి తోడ్పడుతుంది. మీరు నిద్రపోయే ముందు ముఖం శుభ్రం చేసుకుని, కొద్దిగా కొబ్బరి నూనెతో ముఖాన్ని సున్నితంగా మసాజ్‌ చేయాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత చల్లని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోండి. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి, ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆలివ్‌ ఆయిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి.

ముడతలు మాయం చేయడానికి రాత్రిపూట ముఖానికి ఆలివ్‌ నూనె అప్లై చేసి, సున్నితంగా మసాజ్‌ చేయండి. ఉదయం నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. కీరాలో చల్లదనం, హైడ్రేటింగ్ గుణాలు ఉంటాయి. రిఫ్రెష్ ట్రీట్ కోసం మీరు మీ కళ్లు, ముఖంపై కీరా ముక్కలను ఉంచాలి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. మీరు ముఖానికి పెరుగు అప్లై చేసి, 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముడతలు మాయం అయ్యి, కాంతివంతమైన చర్మం పొందవచ్చు.