Site icon HashtagU Telugu

Winter: చలికాలంలో పెదవులు పగలకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే!

Winter

Winter

ప్రస్తుతం రోజురోజుకీ చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దానికి తోడు వర్షాలు కూడా మొదలయ్యాయి. దీంతో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇకపోతే చలికాలం వచ్చింది అంటే చాలు చర్మం పెదవులకు సంబంధించిన చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. చలికాలం రాగానే ఎదురయ్యే ప్రధాన సమస్య చర్మ సమస్యలు. చర్మం పొడిబారడం, పగలడం, చర్మం మంటగా అనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా పెదాలు చలికాలంలో పగలడంతో పాటు కొన్ని కొన్ని సార్లు రక్తం కూడా వస్తూ ఉంటుంది. అది మనుషులను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

అయితే మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తేనెను పెదాలకు అప్లై చేయడం వల్ల స్మూత్ గా మారతాయిట. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీంతో పెదాలు పొడిగా మారడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తాయి. రాత్రి పడుకునే ముందు పెదాలకు తేనెను అప్లై చేసుకోవడం వల్ల పెదవులు స్మూత్ గా మారి పగుళ్ల సమస్యలు తగ్గుముఖం పడతాయట. కలబంద కూడా పెదాల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే ఇందులోని మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీ డ్రైనెస్‌ సమస్యను దూరం చేస్తుంది.

రాత్రి పడుకునే ముందు కొంచెం అలొవెరా జెల్‌ ను పెదాలపై అప్లై చేసుకొని కాసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలు స్మూత్‌గా మారుతాయి. కొబ్బరి నూనెలో కూడా మంచి మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని తక్షణమే హైడ్రేట్‌గా చేస్తుంది. కేవలం కొబ్బరి నూనె మాత్రమే కాకుండా బాదం నూనె, అవకాడో నూనె, ఆలివ్ నూనెలు కూడా పెదాలను కాపాడుతాయట. కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల నుంచి పెదాలను కాపాడుతాయట. అలాగే పెదాలకు నెయ్యిని అప్లై చేయడం వల్ల ప్రభావవంతంగా పనిచేస్తుంది. నెయ్యి నేచురల్‌ లిప్‌ బామ్‌ గా ఉపయోగపడుతుంది. ఇందులోని ఎన్నో పోషకాలు పెదాల ఆరోగ్యాన్ని కాపాడుతాయట. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు నెయ్యిని అప్లై చేసుకుంటే ఉదయం లేచే సరికి పెదాలు స్మూత్‌గా మారుతాయట.