Hair Loss: ఈ టీతో తలస్నానం చేస్తే చాలు.. జుట్టు బాగా పెరగడంతో పాటు?

ఈ రోజుల్లో జుట్టు రాలడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. దీని కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్త్రీ పురు

  • Written By:
  • Publish Date - August 29, 2023 / 10:30 PM IST

ఈ రోజుల్లో జుట్టు రాలడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. దీని కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్త్రీ పురుషులకు చాలామందికి ఈ హెయిర్ ఫాల్ సమస్య అన్నది మరింత తీవ్రతరం అవుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గించుకోవడం కోసం రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లు హోమ్ రెమెడీలను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ టీతో తల స్నానం చేస్తే హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది అంటున్నారు నిపుణులు. మరి ఆ టీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె, ఆవనూనె ఇలా ఏ నూనె అయినా తీసుకుని జుట్టుకి మసాజ్ చేయాలి.

మీ జుట్టు రకాన్ని బట్టి వేడి చేయాలి. కాస్తా వేడిగా ఉన్నప్పుడే జుట్టు మొత్తానికి మసాజ్ చేయాలి. హెయిర్ మసాజ్‌కి 30 నుండి 45 నిమిషాల పాటు మసాజ్ చేయవచ్చు. దీన్ని ఓపిగ్గా జుట్టు మొత్తానికి మూలాల నుంచి చివర వరకూ అప్లై చేయాలి. జుట్టుని పాయలుగా విడదీసి మెల్లిగా రుద్దాలి. జుట్టుకి మసాజ్ చేసిన తర్వాత జుట్టుని బాగా దువ్వి ఆ తర్వాత తలపై హెయిర్ కవర్ వేసి రెండు గంటల తర్వాత మైల్డ్ షాంపూతో క్లీన్ చేసుకోవాలి. నెలకు ఒకసారి ఇలా మసాజ్ చేస్తే జుట్టుకి పూర్తి పోషణ లభిస్తుంది. జుట్టు రాలదు. అదేవిధంగా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే, జుట్టు రాలడానికి ముఖ్య కారణం ఒత్తిడి, టెన్షన్. దీన్ని తగ్గించడం వల్ల కచ్చితంగా జుట్టు రాలడం తగ్గుతుంది.

రోజూ ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ధ్యానం వల్ల శరీరానికి, జుట్టుకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజువారీ జుట్టు సంరక్షణలో మీరు జుట్టుకి పోషణ అవసరం. దీనికి ఎక్కువ మెంటనెన్స్ అవసరం లేదు. ఒంటరిగా సమయం గడపాల్సిన అవసరం లేదు. తలస్నానం చేసినప్పుడల్లా గ్రీన్ టీ బ్యాగ్‌ని వేడి నీటిలో నానబెట్టి, దాన్ని చల్లబరిచి, జుట్టు మొత్తానికి అప్లై చేయండి. తలకి సమానంగా అప్లై చేయాలి. తర్వాత గంటసేపు అలాగే ఉంచి మీ జుట్టుని రెగ్యులర్‌గా దువ్వుకోవాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు పెరిగేలా చేస్తాయి.

బాదం నూనె, ఆలివ్ ఆయిల్, కొద్దిగా స్వచ్ఛమైన కొబ్బరినూనె తీసుకుని దానిని మీ వేళ్ళతో అప్లై చేసి కొద్దిగా మసాజ్ చేయాలి. ఇది తలకు రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. చుండ్రు సమస్యని దూరం చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీరు జుట్టు రాలినట్లు అనిపిస్తే జుట్టు రాలడాన్ని నివారించేందుకు కొన్ని చిట్కాలను పాటించాలి. ఇందుకోసం ఉల్లిపాయ రసం, అల్లం రసం రాత్రిపూట రాయాలి. ఉదయం వరకూ అలానే ఉండాలి. తర్వాత తలస్నానం చేయాలి. జుట్టు రాలడం కంట్రోల్ అయ్యేందుకు ఈ టిప్ బాగా పనిచేస్తుంది.