Constipation Remedies: మలబద్ధకానికి సహజ నివారణలు

మారుతున్న జీవనశైలి (Life Style), సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నీటిని తాగకపోవడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది.

మారుతున్న జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నీటిని తాగకపోవడం వల్ల మలబద్ధకం (Constipation) సమస్య వస్తుంది. మల విసర్జన సాఫీగా జరగకపోవడాన్ని మలబద్ధకం అంటారు. తీవ్ర ఒత్తిడితో విరేచనం అవ్వడం, మల ద్వారంపై ఒత్తిడి పెరగడం అనేవి దీనివల్ల జరుగుతాయి. ఫలితంగా మల ద్వారం వద్ద తీవ్రమైన నొప్పి, మంట, వాపు, రక్తం కారడం వంటివి జరుగుతుంటాయి.

ఒకటి లేదా రెండు సార్లు మల బద్ధకం రావడం సాధారణ విషయమే. అయితే ఇది తరచుగా జరిగితే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ‘ఫిషర్స్‌’ బారిన పడే అవకాశాలు ఉంటాయి. మలబద్ధకం (Constipation) చికిత్సకు ఉపయోగపడే 6 సహజ నివారణలు ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగు + అవిసె గింజల పొడి

పెరుగులో Bifidobacterium lactis అని పిలువబడే స్నేహపూర్వక బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది. అవిసె గింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. పెరుగు, అవిసె గింజల పొడిని కలిపి తీసుకుంటే మలం మృదువుగా మారి, సాఫీగా బయటికి వస్తుంది.

ఉసిరి రసం

30 మి.లీ ఉసిరి రసాన్ని ఒక గ్లాసు నీటిలో కలిపి ఉదయం పూట తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.మలబద్ధకం తగ్గుతుంది.

ఓట్స్ బ్రాన్ (ఓట్స్ పొట్టు)

ఓట్స్ బ్రాన్ లో కరిగే మరియి కరగని ఫైబర్ రెండూ అధికంగా ఉంటాయి. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో హెల్ప్ చేస్తుంది. ఇది మన పేగుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

నెయ్యి + పాలు

నెయ్యి అనేది బ్యూట్రిక్ యాసిడ్ యొక్క గొప్ప మూలం.బ్యూట్రిక్ యాసిడ్ మన పేగుల జీవక్రియను మెరుగుపరుస్తుంది. మలం యొక్క కదలికలో సహాయపడుతుంది.

వేడి పాలలో నెయ్యి

రాత్రి  నిద్రపోయే ముందు ఒక కప్పు వేడి పాలలో 1 టీస్పూన్ నెయ్యి తీసుకోవడం వల్ల మరుసటి రోజు ఉదయం మలబద్ధకం తగ్గుతుంది.

ఆకు కూరలు

బచ్చలికూర, బ్రస్సెల్స్ మొలకలు, బ్రోకలీ వంటి ఆకుకూరలు ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఫోలేట్ , విటమిన్ సి, విటమిన్ కె కూడా ఉంటాయి. మలబద్ధకం ప్రాబ్లమ్ క్లియర్ కావడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. మన జీర్ణ వ్యవస్థ లోని గట్ సిస్టం ను ఇవి బలోపేతం చేస్తాయి.

నీరు, పండ్ల రసాలు

మీరు నీటిని, పళ్ల రసాలను బాగా తాగాలి. దీనివల్ల మలబద్ధకం ప్రాబ్లమ్ పరిష్కారం అవుతుంది.

ఫైబర్ ఫుడ్, ప్రోబయోటిక్స్

రోజూ మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాల స్థాయి (ఫైబర్) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. ఫలితంగా మల బద్ధకం సమస్య ఏర్పడకుండా ఉంటుంది .ప్రోబయోటిక్స్, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు మరియు అనేక ఇతర ఆహారాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి.

కాస్త నడవాలి

గంటల కొద్ది కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారు ప్రతి అరగంటకోసారి లేచి కాస్త అటు ఇటూ నడవాలి. శరీరానికి కావాల్సిన శ్రమను ఇవ్వాలి. వ్యాయామం చేయాలి.

Also Read:  Sania Mirza in India Cricket: వుమెన్స్ ఐపీఎల్ లో సానియా మీర్జా