Hair Smoothening: అరటిపండుతో ఇలా చేస్తే చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతం?

అరటిపండును ఇష్టపడని వారు ఉండరు. అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అరటి

Published By: HashtagU Telugu Desk
Hair Smoothening

Hair Smoothening

అరటిపండును ఇష్టపడని వారు ఉండరు. అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అరటిపండుతో మన అందాన్ని రెట్టింపు చేసుకోవడంతో పాటు జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం అరటి పండుతో కొన్ని రకాల చిట్కాలు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా అరటి పండుతో పొడవాటి అందమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. హెయిర్ స్మూతింగ్ ప్యాక్.. ఇందుకోసం బంగాళాదుంప 1, మొక్కజొన్న పిండి 3 చెంచాలు, అరటిపండ్లు 2. మొదట బంగాళాదుంప తొక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా చేయాలి.

బంగాళాదుంప ముక్కల్ని మిక్సీలో వేసి బాగా రుబ్బాలి. దీనిని క్లాత్‌తో వడకట్టి రసం తీయాలి. ఈ జ్యూస్‌లో అరటిపండు, మొక్కజొన్న పిండి వేసి మళ్ళీ రుబ్బుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేసి అరగంట ఉంచి ఆ తర్వాత మైల్డ్ షాంపూతో జుట్టుని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కెరాటిన్ ట్రీట్‌మెంట్‌లా స్మూత్‌గా పనిచేస్తుంది. అయితే జుట్టుకి అరటిపండుని వాడడం వల్ల పొడి జుట్టు మృదువుగా మారుతుంది. అరటిపండులోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు, విటమిన్ సి, పొటాషియం జుట్టుని మృదువుగా చేస్తాయి. వేల రూపాయలు వాడిన కెరాటిన్ ట్రీట్‌మెంట్ కోసం అరటిపండ్లు బెస్ట్ ఆప్షన్.

బంగాళాదుంపలో విటమిన్ బి, సి, ఐరన్, జింక్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో స్టార్చ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మొక్కజొన్న పిండిని జుట్టుకి వాడడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది. దీనిని రెగ్యులర్‌గా వాడడం వల్ల జుట్టు అందంగా సిల్కీగా మారుతుంది. అదే విధంగా అదనపు నూనె తొలగిపోయి సిల్కీ అండ్ షైనీ హెయిర్ మీ సొంతమవుతుంది. ఈ రెమిడిని తరచుగా ఫాలో అవుతూ ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

  Last Updated: 01 Sep 2023, 09:32 PM IST