Site icon HashtagU Telugu

Hair In Summer: వేసవిలో జుట్టు అందంగా ఉండాలి అంటే.. ఈ నేచురల్ ప్యాక్స్ ట్రై చేయాల్సిందే!

Hair In Summer

Hair In Summer

మామూలుగా వేసవికాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా హెయిర్ ఫాల్ డాండ్రఫ్ సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. ఎండ కారణంగా తల వెంట్రుకల నుంచి కూడా అధికంగా చెమట వచ్చి హెయిర్ ఫాల్ సమస్య కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయితే వేసవి కాలంలో ఇలా జుట్టుకు సంబంధించిన సమస్యలు ఉండకూడదు అంటే ఇప్పుడు చెప్పబోయే ట్రిక్స్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఒక కప్పు తేనె తీసుకుని చిన్ని ని మంటపై గోరువెచ్చగా వేడి చేయాలి. తర్వాత అందులో పావు కప్పు ఆలివ్ నూనె కలపాలి. ఆలీవ్ నూనె లేదు అనుకున్న వారు కొబ్బరి నూనె ఉపయోగించవచ్చు. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకోవాలి. ఆపై వేడి నీటిలో ముంచిన టవల్ ను తలకు చుట్టుకోవాలి. అరగంట ఆగిన తర్వాత గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయట. ఈ హెయిర్‌ ప్యాక్‌ పొడిబారిన జుట్టుకు తిరిగి జీవం పోస్తుందట. ఎండ కారణంగా జుట్టు పొడిబారటం చివర్లలో చిట్లిపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఉసిరికాయ ఎంతో బాగా ఉపయోగపడుతుందట. కొన్ని ఉసిరికాయలను తీసుకొని మెత్తని ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఈ ముద్దను కుదుళ్లకు పట్టించే మృదువుగా మర్దన చేసుకోవాలి. గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది అని చెబుతున్నారు.

అదేవిధంగా ఒక గిన్నెలో చెంచా నిమ్మ రసం, కోడిగుడ్డులోని తెల్ల సొన, రెండు పచ్చ సొనలు ఒక చెంచా తేనె తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి తలకు రాసుకొని 15 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల కురులకు కోల్పోయిన తేమ అందుతుందని చెబుతున్నారు. అలాగే అర కప్పు మినప్పప్పుకి ఒక చెంచా మెంతులు కలిపి మెత్తని పొడిలా చేసుకోవాలట. ఈ పొడికి అర కప్పు పెరుగు కలపాలట. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుందట. ఈ విధమైన చిట్కాలు పాటిస్తే వేసవి కాలంలో వచ్చే జుట్టుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.