Mosquitoes: వర్షాకాలంలో దోమల నివారణ

వర్షాకాలంలో దోమల బెడద కలవర పెడుతుంటుంది. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, జికా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రభలుతాయి.

Mosquitoes: వర్షాకాలంలో దోమల బెడద కలవర పెడుతుంటుంది. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, జికా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రభలుతాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఈ వ్యాధులన్నీ ప్రాణాంతకంగా మారతాయి. అందుకే ఈ సీజన్‌లో వీలైనంత వరకు దోమలకు దూరంగా ఉండండి. ఇంట్లోకి దోమలు రాకుండా ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.

పుదీనా వాసన ఘాటుగా ఉంటుంది. దీని సువాసన వల్ల దోమలు పారిపోతాయి. కాబట్టి మీరు ఇంట్లో వివిధ ప్రదేశాలలో పుదీనా ఆకులు లేదా దాని నూనె ఉంచండి. పుదీనా మొక్కలు నాటడం కూడా దోమల నుండి రక్షించడంలో సహాయపడుతుంది .లావెండర్ ఆయిల్ కూడా దోమలను నివారించడానికి సమర్థవంతంగా పని చేస్తుంది. లావెండర్ ఆయిల్ దోమల నుండి మాత్రమే కాకుండా ఇతర కీటకాల నుండి కూడా రక్షించడంలో ఉత్తమమైనది. ఈ నూనెను మీ చర్మానికి కూడా రాసుకోవచ్చు.

టీ ట్రీ ఆయిల్‌లో అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడమే కాకుండా దోమలను నివారించడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇంట్లోనే టీ ట్రీ ఆయిల్ స్ప్రే తయారు చేసి స్ప్రే చేస్తూ ఉండండి. స్ప్రే బాటిల్‌లో కొన్ని నీళ్లు మరియు కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపండి. పగలు, సాయంత్రం ఇంటి పరిసరాల్లో పిచికారీ చేయాలి.

నీరు నిల్వ ఉన్న చోట దోమలు తమ స్థావరాలు ఏర్పరుచుకుంటాయి. వర్షాకాలంలో నీరు చాలా ప్రదేశాలలో పేరుకుపోతుంది, ఇది దోమల వ్యాప్తిని పెంపొందిస్తుంది. అయితే సబ్బు నీరు దోమలకు ప్రాణాంతకం. మీరు ఇంట్లోని వివిధ ప్రదేశాలలో ఒక పాత్రలో సబ్బు నీటిని ఇచితే ఫలితం ఉంటుంది. దోమ సబ్బు నీటి దగ్గరికి వచ్చిన వెంటనే అది నురుగులో చిక్కుకుని చనిపోతుంది.

Also Read: Varahi Yatra 4th Schedule : అక్టోబర్‌ 1 నుంచి పవన్ నాల్గో విడత వారాహి యాత్ర