Site icon HashtagU Telugu

Grey Hair: ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ ప్యాక్ తో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం?

Mixcollage 09 Feb 2024 08 54 Pm 7185

Mixcollage 09 Feb 2024 08 54 Pm 7185

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న వయసు లోనే తెల్ల జుట్టు సమస్యతో చాలామంది తెగ ఇబ్బంది పడుతున్నారు. అయితే తెల్ల జుట్టును కవర్ చేసుకోవడం కోసం చాలామంది అనేక రకాల హెయిర్ కలర్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది రకరకాల హెయిర్ ఆయిల్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల ఫలితం లేక దిగులు చెబుతూ ఉంటారు. మీరు కూడా తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే కొన్నింటిని ఉపయోగించి మీ తెల్ల జుట్టు సమస్యకు పెట్టవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

అశ్వగంధ పొడి. ఇది జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది నెరసిన జుట్టుకే కాదు, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టుని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెరసిన జుట్టుని తగ్గించేందుకు బ్రహ్మి ఆకులు హెల్ప్ అవుతాయి. దీనిని వాడడం వల్ల చుండ్రు దూరమవుతుంది. జుట్టు సమస్యలు దూరమవుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇందులో ఉన్నాయి. ఇది జుట్టుని కాపాడుతుంది. జుట్టునితెల్లబడడాన్ని తగ్గిస్తుంది. అన్ని సహజ పదార్థాలు జుట్టు పెరుగుదలకి సాయపడతాయి. మందారపువ్వు, ఆకుల్లో కండీషనింగ్ లక్షణాలు ఉన్నాయి. వీటిని వాడితే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తుంది.

జుట్టుని నల్లగా చేస్తుంది. ఉసిరి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వెంట్రుకలు నెరసిపోకుండా ఉండేందు, పెరగడానికి ఉసిరి హెల్ప్ చేస్తుంది. దీనిని వాడడం వల్ల కండీషనర్‌గా పనిచేసి ఒత్తైన, దృఢమైన జుట్టుకి హెల్ప్ చేస్తుంది. దీనిని వాడడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుుతంది. ఇందులోని పోషకాలు జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తాయి. ఈ పౌడర్ తయారు చేసేందుకు బ్రహ్మి ఆకులు, పువ్వులు, మందారపువ్వులు, ఉసిరి కాయల్ని ఆరబెట్టుకోవాలి. వీటన్నింటిని సమపాళ్ళలో తీసుకోవాలి. కలిపి పొడి చేయాలి. దీనిని పెరుగులో కలిపి వారానికి ఓసారి ప్యాక్ వేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.