Hair Pack: పట్టులాంటి ఒత్తైనా జుట్టు మీ సొంతం కావాలంటే ఈ మాస్క్ ను వారానికి ఒకసారి ట్రై చేయాల్సిందే?

శీతాకాలంలో చాలామంది అనేక రకాల జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జుట్టు చిట్లిపోవడం ఎర్రగా అయిపోవడం ఎక్కువగా హెయిర్ ఫాల్

Published By: HashtagU Telugu Desk
Mixcollage 26 Jan 2024 08 27 Pm 7328

Mixcollage 26 Jan 2024 08 27 Pm 7328

శీతాకాలంలో చాలామంది అనేక రకాల జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జుట్టు చిట్లిపోవడం ఎర్రగా అయిపోవడం ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సీజన్‌ చలి, చల్లటి గాలుల కారణంగా జుట్టు తేమ కోల్పోయి పొడిబారుతుంది. చుండ్రు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శీతాకాలంలో జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మరి అందుకోసం వారానికి ఒక్కసారైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే మాస్క్ ను ట్రై చేయాల్సిందే. అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..
బాగా పండిన అరటిపండు, ఏడు చుక్కల బాదం నూనె బ్లెండర్‌లో వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి.

ఈ పేస్ట్‌ను జుట్టుకు మాస్క్‌లా అప్లై చేయండి. షవర్‌ కవర్‌ వేసుకొని అరగంట ఆరనివ్వాలి. ప్యాక్‌ ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ మాస్క్‌ మాడుపైన కణాలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చుండ్రు, దురదవంటి సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు నల్లగా మెరిసి పోవడం ఖాయం. అలాగే నాలుగైదు చెంచాల పాలల్లో చెంచా తేనె కలిపి తలకు, జుట్టుకు అప్లై చేసి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత ఘాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. పొడారిన జుట్టును ఈ మాస్క్‌ మృదువుగా మారుస్తుంది. పాలలోని ప్రొటీన్‌ జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. అంతేకాదు, వీటిలోని కాల్షియం హెయిర్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తుంది.

పాలలోని విటమిన్‌ ఏ, పొటాషియం జుట్టును కాంతివంతంగా ఉంచుతాయి. పెరుగు అరకప్పు, స్పూన్‌ తేనె, బాదం నూనె ఒక చెంచా బౌల్‌లో తీసుకుని మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు రాసి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్‌ వారానికి ఒకసారి అప్లై చేస్తే పట్టులాంటి మీ సొంతం అవుతుంది. ఒక బౌల్‌లో గుడ్డు పచ్చసొన తీసుకోవాలి ఇందులో రెండు రెండు చెంచాల గ్రీన్‌టీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి 20 నిమిషాల తర్వాత షాంపుతో స్నానం చేస్తే చాలు. ఇది కుదుళ్లు, శిరోజాలకు పోషకాలను అందించి, చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. జుట్టు రాలడం తగ్గింది, మృదువుగా మారుస్తుంది. కప్పుకి సరిపడా మందార పూల రేకుల్ని తీసుకొని రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని మెత్తగా చేసి దానికి ఆలివ్‌నూనెను మిక్స్‌ చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు మాస్క్‌గా వేయండి. దీన్ని గంటసేపు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయండి. ఇలా చేస్తే పట్టులాంటి జుట్టు మీ సొంతం అవుతుంది.

  Last Updated: 26 Jan 2024, 08:29 PM IST