Site icon HashtagU Telugu

Hair Tips: తెల్లజుట్టు నల్లగా మారాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే?

Hair Tips

Hair Tips

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. అయితే తెల్ల జుట్టును కవర్ చేసుకోవడం కోసం రకరకాల హెయిర్ కలర్లు, హెయిర్ షాంపూలతో పాటు హోమ్ రెమెడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే వాటితో పాటుగా కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అలాగే ఇకపై తెల్ల జుట్టు సమస్య కూడా వేధించదు. అసలు జుట్టు తెల్లగా మారడానికి గల కారణాలు ఏంటి అన్న విషయంలోకి వెళితే.. ప్రస్తుతం కాలంలో చాలా మందికి త్వరగా జుట్టు తెల్లబడిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి పని ఒత్తిడే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

కాబట్టి జుట్టు సమస్యలను తగ్గించుకోవాలంటే ముందుగా ఒత్తిడిని తగ్గించుకుని సరైన లైఫ్‌స్టైల్, డైట్ పాటించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు తెల్లబడే సమస్య మాత్రమే కాకుండా, హెయిర్ ఫాల్ సమస్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మరి తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. ఉసిరి జుట్టుకి ఎంతో మంచిది. దీనిని నేరుగా తీసుకున్నా పూతలా వేసుకున్నా కూడా జుట్టు సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా తెల్ల జుట్టుని నల్లబరచడంలో ఉసిరి బాగా పనిచేస్తుంది. ఇందుకోసం 3 మందార పువ్వులు తీసుకొని తీసుకుని అందులో 2 టీ స్పూన్ల ఉసిరిపొడి కలిపి మెత్తగా పేస్టు చేయాలి. తర్వాత అందులో కొద్దిగా పెరుగు, నీటిని కలిపి తలకు పట్టించి,ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. మరో చిట్కా విషయానికి వస్తే..

టేబుల్ స్పూన్ ఆముదం రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి వేడి చేయాలి. ఈ నూనె వేడిగా ఉన్నప్పుడే కుదుళ్లకు పట్టేలా మర్దన చేసి రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా చేయడం వాళ్ళ మంచి ఫలితం కనిపిస్తుంది. ఆముదం రాయడం వల్ల చాలా వరకూ కేశ సమస్యలన్నీ దూరం అవుతాయి. అలాగే జుట్టు కూడా నల్లబడుతుంది. అదేవిధంగా గోరింటాకు కూడా కేశ సమస్యలను దూరం చేస్తుంది. ఇందుకోసం 6 టేబుల్ స్పన్ల హెన్నాని తగినన్ని నీటితో కలిపి పేస్ట్ లా చేసి దాన్ని చక్కగా తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు నల్లబడుతుంది.