అందంగా కనిపించడం కోసం వేలకు వేలు ఖర్చు చేయడంతో పాటు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లోనే దొరికే వాటితో నాచురల్ రెమిడీలను ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించవు. మరి అలాంటప్పుడు ఏమి చేయాలో ఎలాంటి టిప్స్, ప్యాక్స్ ట్రై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శెనగపిండి, పసుపు ఫేస్ ప్యాక్.. రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి, ఒక టీ స్పూన్ పసుపు పొడిని కలపాలి. పేస్ట్ చేయడానికి పాలు లేదా రోజ్ వాటర్ ఉపయోగించాలి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ మాయం అవ్వడంతో పాటు డార్క్ స్పాట్స్,ముఖంపై ఉండే డస్ట్ మొత్తం క్లీన్ అవుతుందట.
అలాగే బంగాళదుంప, అలోవెరా జెల్, శెనగ పిండి ఫేస్ ప్యాక్ బంగాళాదుంప నల్లటి వలయాలకు తొలగించడానికి బాగా పనిచేస్తుందట. కలబంద శీతలీకరణ ప్రభావాలకు గొప్పది. బంగాళాదుంప, అలోవెరా జెల్, శనగ పిండి మీ చర్మానికి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్ గా పనిచేస్తాయట. ఈ ప్యాక్ చేయడానికి బంగాళదుంప గుజ్జు, అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండిని కలపాలి. పేస్ట్ చేయడానికి నీటిని కూడా ఉపయోగించవచ్చు. ఈ DIY ఫేస్ ప్యాక్ ని అప్లై చేసి, మీ చర్మంపై 10 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత శుభ్రం చేయాలనీ చెబుతున్నారు.
నిమ్మకాయ, టొమాటో ఫేస్ ప్యాక్.. ఈ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చమురు ఉత్పత్తిని నియంత్రించడంలో ఎంతో బాగా సహాయపడతాయట. అలాగే చర్మానికి కూడా సహజ మెరుపును అందిస్తాయట. ఈ ప్యాక్ కోసం, టొమాటో గుజ్జును తీసుకొని, ఒక టీస్పూన్ నిమ్మరసం జోడించి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి.
కాఫీ, పాలు ఫేస్ ప్యాక్.. ఈ రెండు పదార్థాలను 2:1 నిష్పత్తిలో కలపి మీ ముఖం మీద అప్లై చేయాలి. పాలలోని లక్షణాలు మీ చర్మానికి స్థితిస్థాపకతను నిర్ధారిస్తాయట. అలాగే ఇది ముఖంపై ముడతలను తగ్గించడంతో పాటు, ముఖం మెరిసిపోయేలా చేయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.