Site icon HashtagU Telugu

Beauty Tips: ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయాల్సిందే!

Beauty Tips

Beauty Tips

ప్రస్తుత రోజుల్లో కాలుష్యం అలాగే ఇతర కారణాల వల్ల అందానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముఖంపై పింపుల్స్,మచ్చలు డ్రైగా కనిపించడం, లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో ఈ సమస్యల నుంచి బయటపడటం కోసం చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాంతివంతంగా మెరిసిపోవడం కోసం రకరకాల ఫేస్ ప్యాక్ లు కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఇంకొందరు బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే అందుకోసం కొన్ని న్యాచురల్ టిప్స్ పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఒక గిన్నెలో నాలుగు బొప్పాయి ముక్కలు వేసి గుజ్జు చేసి దానికి రెండు టీ స్పూన్ తేనె కలపాలి ఈ మిశ్రమం కాస్త గట్టిగానే ఉండాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకి అప్లై చేసి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తేనె చర్మాన్ని హైడ్రేట్ చేస్తే, బొప్పాయి లోని ఎంజైమ్లు సహజ చర్మాన్ని తెల్లగా చేయడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే టమాటా గుజ్జును మెత్తగా చేసి దానికి రెండు మూడు టీ స్పూన్ల శనగపిండిని కలపాలి దీన్ని ముఖం మెడకు అప్లై చేయాలి. ఇది తడి ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో కడగాలి. దీనివలన మొఖం నిగారింపుతో మెరుస్తూ ఉంటుంది. అలాగే కుంకుమ పువ్వు పాలు మిశ్రమం కూడా ముఖానికి మంచి ఫేస్ ప్యాక్ అని చెప్పవచ్చు.

మూడు నాలుగు స్పూన్ల చల్లటి పాలలో రెండు మూడు కుంకుమ పువ్వులను యాడ్ చేసి అరగంటసేపు నానబెట్టాలి. ఆ తరువాత ముఖానికి అప్లై చేసుకోవాలి. ఎండి పోయిన తర్వాత మళ్లీ దానిమీద మరో కోటింగ్ వేయాలి. తడి ఆరిపోయిన తర్వాత దానిని చల్లని నీటితో కడగాలి. అలాగే రోజ్ వాటర్ చందనం మిశ్రమంతో ఫేస్ ప్యాక్ పెట్టుకొని అరగంట పోయిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం అవ్వడం ఖాయం. రోజు వాటర్ స్కిన్ పీహెచ్ స్థాయిలని బ్యాలెన్స్ చేస్తుంది. చందనం చర్మం రంగుని మెరిసేలే చేస్తుంది. కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ లో ఇంట్లో ట్రై చేస్తే చాలు మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.