Site icon HashtagU Telugu

Wrinkles: ముఖంపై ముడతలు తగ్గి యంగ్ గా కనిపించాలి అంటే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వడం ఖాయం!

Wrinkles

Wrinkles

మామూలుగా వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు మచ్చలు వంటివి రావడం అన్నది సహజం. ముఖ్యంగా ముఖంపై ముడతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా కూడా ముఖంపై ముడతలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉంటారు. అయితే ముఖంపై ముడతలు వచ్చినప్పుడు ఆ ముడతలు తగ్గి యంగ్ గా కనిపించాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖంపై ముడతలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. తగినంత నిద్ర లేకపోవడం, ఒత్తిడి, బిజీ లైఫ్ స్టైల్ వంటి అనేక కారణాల వల్ల కూడా ముఖంపై ముడతలు వస్తూ ఉంటాయి. వీటి వల్ల ముఖం చాలా అలసిపోతుంది. ఆ తర్వాత కండరాలు కూడా బిగుసుకుపోతాయి.

దీని వల్ల చిన్న వయసులోనే కండరాలు కుంచించుకుపోయి ముఖంపై ముడతలు వస్తాయట. నిజానికి, వయసు పెరిగేకొద్దీ చర్మంపై ముడతలు రావడం సహజం. కానీ ముడతలకు వయసుకీ సంబంధం లేదట. అంటే చిన్న వయసులో కూడా ముడతలు రావచ్చు అని చెబుతున్నారు. ఇకపోతే ముఖంపై ముడతలను తొలగించడానికి చాలా మంది మహిళలు తమ ముఖాన్ని మరింత అందంగా కనిపించేలా చేయడానికి రసాయనాలను కలిగి ఉన్న సౌందర్య ఉత్పత్తులను తరచుగా ఉపయోగిస్తారు. ఈ మేకప్‌ ను తొలగించడానికి వారు మరికొన్ని ఉత్పత్తులను ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ వీటి వల్ల చర్మం దెబ్బతింటుందట. ముఖ కండరాలు కుంచించుకుపోతాయట. కాబట్టి ముఖానికి మేకప్ వాడితే దాన్ని తొలగించడానికి కొబ్బరి నూనెను ఉపయోగించడం మంచిది అని చెబుతున్నారు.

కొబ్బరి నూనెను ముఖానికి పట్టించి 10 నిమిషాలు మసాజ్ చేయాలట. ఇది ముఖ కండరాలను బిగుతుగా చేస్తుందట. అంతేకాదు చర్మం బిగుతుగా ఉంటుందని ముఖంపై ముడతలు కూడా రావు అని చెబుతున్నారు. ముఖంపై ముడతలను తొలగించడానికి, చందనం పొడి, తేనె, గుడ్డులోని తెల్లసొనను కలపాలట. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఈ మూడింటిలో ఉండే పోషకాలు కండరాలను బిగుతుగా చేయడంలో సహాయపడతాయట. వారానికి ఒక సారైనా దీన్ని ఉపయోగిస్తే ముఖం కాంతివంతంగా ఉంటుందట. మీరు కొబ్బరి నూనెలో పసుపు కలిపి ముఖానికి రాసినా మీ ముఖం అందంగా కనిపిస్తుందట. అలాగే పెరుగు ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని అందంగా మారుస్తుందట.

అయితే దీని కోసం మీరు రాత్రి పడుకునే ముందు ముఖానికి పెరుగు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలట. ఇలా చేయడం వల్ల పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చనిపోయిన చర్మ కణాలను పూర్తిగా తొలగించి మొటిమలు రాకుండా నివారిస్తుందని చెబుతున్నారు. పెరుగుతో పాటు కీర దోసకాయ ఫేస్ ప్యాక్‌ను కూడా ఉపయోగించవచ్చట. ఇది జిడ్డు, పొడి చర్మం ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందట. దీని కోసం కీరదోసకాయను పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలని చెబుతున్నారు. దీన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలట. దీన్ని పెరుగులో వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలట. అయితే వారానికి రెండుసార్లు ఇలా చేస్తే ముఖంపై ఉండే మలినాలు తొలగిపోయి మీ చర్మం కాంతివంతంగా కనిపిస్తుందట. అంతేకాదు మీరు చిన్నవారిగా కనిపిస్తారట.