Site icon HashtagU Telugu

Dark Circles: 3 రోజుల్లో డార్క్ సర్కిల్స్ మాయం అవ్వాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే?

Mixcollage 08 Feb 2024 06 43 Am 3647

Mixcollage 08 Feb 2024 06 43 Am 3647

ఈ రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ముఖం అందంగా ఉన్న కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి ముఖం అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. పురుషులు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకపోయినా స్త్రీలు ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, అనేక రకాల చిట్కాలను, బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు రావు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా నిద్రలేమి, అలసట, కంప్యూటర్‌/మొబైల్ ఎక్కువసేపు వాడడం, ఒత్తిడి, పోషకాహారం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, మానసిక ఆందోళన, రక్తహీనత, హార్మోన్ల సమస్య, అధిక బరువు, పీసీఓడీ కారణంగా ఈ డార్క్ సర్కిల్స్ వస్తాయి.

కంటి కింద వలయాలు పోగొట్టకోవడానికి కొంతమంది మందులు వాడుతూ ఉంటారు, ట్రీట్మెంట్స్‌ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా, మన ఇంట్లో దొరికే వస్తువులతో డార్క్‌ సర్కిల్స్ ని దూరం చేసుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలి అన్న విషయాన్ని వస్తే.. మీరు డార్క్‌సర్కిల్స్‌ సమస్యతో బాధపడుతుంటే అలోవెరా జెల్‌ అద్భుతంగా సహాయపడుతుంది. కలబంద గుజ్జులో కాటన్‌ ముంచి కళ్ల కింద ఉంచాలి. దీన్ని 10-15 నిమిషాల పాటు ఉంచి తడి టవల్‌ లేదా టిష్యూ పేపర్‌తో తుడవాలి. ఇలా వరసగా మూడు రోజులు చేస్తే రిజల్ట్‌ మీకే కనిపిస్తుంది. మరో చిట్కా విషయానికి వస్తే.. పసుపులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. పెరుగు చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

పెరుగులో పసుపు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ని కళ్ల కింద నల్లగా ఉన్న ప్రదేశాలలో అప్లే చేసి ఆరనివ్వాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత.. గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మూడు రోజుల పాటు రోజుకు రెండు సార్లు చేస్తే, మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. అదేవిధంగా ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకొని, దానిలో పదినిమిషాల పాటు గ్రీన్‌టీ బ్యాగ్‌ ఉంచాలి. ఆ తర్వాత దాన్ని బయటకు తీసి 20 నిమిషాల పాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. ఈ టీ బ్యాగ్‌ చల్లబడిన తర్వాత వాటిని కళ్లపై ఉంచాలి. చల్లదనం పోయే వరకు మీ కళ్లపై ఉంచాలి. ఇది కంటి వేడిని తగ్గిస్తుంది, స్ట్రెస్‌ నుంచి రిలీఫ్‌ ఇస్తుంది. తద్వారా డార్క్‌ సర్కిల్స్‌ సమస్య పరిష్కారం అవుతుంది.

Exit mobile version