Site icon HashtagU Telugu

Beauty Tips: ప్రైవేట్ పార్ట్స్ నల్లగా మారాయా.. అయితే ఇవి ట్రై చేయాల్సిందే?

Mixcollage 14 Feb 2024 11 16 Pm 6279

Mixcollage 14 Feb 2024 11 16 Pm 6279

మాములుగా ప్రైవేట్ పార్ట్స్ నల్లగా ఉండడం అన్నది కామన్. అయితే ఈ సమస్య పట్ల స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. ప్రైవేట్ పార్ట్స్ లో ఉన్న నలుపుదనాన్ని పోగొట్టుకోవడం కోసం రకరకాల బ్యూటీ ప్రొడక్తులు హోమ్ రెమిడీలను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ప్రైవేట్ పార్ట్స్‌లో ఈ నలుపు పెరగడానికి చాలా కారణాలున్నాయి. ఆడవారి బాడీలో యోని అనేది చాలా సున్నిత భాగం. అందువల్ల త్వరగా సమస్యలు వస్తాయి. వీటిని దూరం చేయాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటించాల్సిందే.. మరి ఆ చిట్కాలు ఏవి అన్న విషయానికి వస్తే.. యోని నల్లగా ఉండడం అనేది ఎలాంటి ఆరోగ్య సమస్యని సూచించదు. కానీ, ఆ పార్ట్స్ నల్లగా మారడం అనేది చెడు ఆహారపు అలవాట్లు, ధూమపానం, హెయిర్ రిమూవల్ క్రీమ్స్, బిగుతుగా ఉండే బట్టలు, స్కిన్ ఇన్ఫెక్షన్స్, వంశపారపర్యంగా రావడం, వృద్ధ్యాప్యం, ఊబకాయం కారణంగా వస్తుంది.

దీని కారణంగా, ఇతర భాగాలతో పోల్చినప్పుడు ప్రైవేట్ పార్ట్స్ చర్మ రంగు భిన్నంగా ఉంటుంది. అయితే, ఇక్కడ ఏవైనా రాయడానికి చాలా మంది భయపడుతుంటారు. దీనికి కారణం ఆ పార్ట్స్ సెన్సిటీవ్ కాబట్టి. చర్మ పీహెచ్ బ్యాలెన్స్‌ని కాపాడేందుకు పెరుగు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులోని బ్యాక్టీరియా అనేక యోని సమస్యలకి పెరుగు పరిష్కారం. దురద,చెడు వాసన, పొడి దనాన్ని దూరం చేసేందుకు పెరుగు చాలా మంచిది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ పెరుగు, ఓ టీ స్పూన్ తేనె, ఒకటిన్నర టీ స్పూన్ల ఓట్స్ తీసుకుని కలపాలి. ఈ పదార్థాలలో దేనికైనా మీకు అలర్జీ ఉందో లేదో చెక్ చేయడం ముఖ్యం. బాగా మిక్స్ చేసి చర్మంపై అప్లై చేసి 10 నిమిషాల పాటు మెల్లిగా రుద్దండి. తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. చర్మ సహజరంగుని మెరిపించడంలో శనగపిండి బాగా పనిచేస్తుంది.

దీని వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తగ్గిపోతుంది. పిండిలో కొద్దిగా నీరు కలిపి ప్రైవేట్ పార్ట్స్‌కి అప్లై చేయాలి. నీటికి బదులు మీరు పాలు కూడా అప్లై చేయొచ్చు. చాలా చర్మ సమస్యలకి అలోవేరా అనేది చక్కని పరిష్కారం. దీనిని చర్మానికి అప్లై చేస్తే చర్మ రంగు మెరుగ్గా మారుతుంది. కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, బి12లు పుష్కలంగా ఉన్నాయి. దోసకాయలో అలోవేరాని కలిపి రాయడం వల్ల చర్మం తెల్లగా మెరుస్తుంది. ఇందుకోసం ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, దోసకాయ రసాన్ని తీసుకుని బాగా కలిపి, దాన్ని చర్మంపై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత సర్క్యులర్ మోషన్‌లో బాగా మసాజ్ చేయాలి. రెండు నిమిషాల తర్వాత స్కిన్ ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. ఇది సాధారణ నీటితో కడగాలి. సబ్బు అసలు ఉపయోగించకూడదు.

Exit mobile version