Narcissistic Personality Disorder: నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నోళ్ల సంగతిదీ..!

వ్యక్తిత్వం ఆధారంగానే వ్యక్తి వ్యవహార శైలి ఉంటుంది. ఇవాళ మనం ఒక పర్సనాలిటీ డిజార్డర్ గురించి తెలుసుకో బోతున్నాం. అదే.. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ (Narcissistic personality disorder). ఇదొక మానసిక ఆరోగ్య సమస్య. దీని నిర్ధారణ కోసం అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రచురించిన డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM-5) ను వైద్యులు ఉపయోగిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Narcissistic

Resizeimagesize (1280 X 720) (4) 11zon

మనుషులంతా ఒక్కటే.. ఇది నిజం.. కానీ వ్యక్తిత్వాలు వేర్వేరు.. అందుకే పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. మనుషుల్లో భిన్న విభిన్న వ్యక్తిత్వాలు (పర్సనాలిటీస్) అంతర్గతంగా దాగి ఉంటాయి. వ్యక్తిత్వం ఆధారంగానే వ్యక్తి వ్యవహార శైలి ఉంటుంది. ఇవాళ మనం ఒక పర్సనాలిటీ డిజార్డర్ గురించి తెలుసుకో బోతున్నాం. అదే.. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ (Narcissistic personality disorder). ఇదొక మానసిక ఆరోగ్య సమస్య. దీని నిర్ధారణ కోసం అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రచురించిన డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM-5) ను వైద్యులు ఉపయోగిస్తున్నారు. ఈ డిజార్డర్ ఉన్నవాళ్ల థింకింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..!

నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్

లక్షణాలు

● నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవాళ్లు ప్రతిసారీ ప్రజలు తమను మెచ్చుకోవాలని కోరుకుంటారు. ఎల్లప్పుడూ అందరి దృష్టి తమ మీదే ఉండాలని భావిస్తారు. ఈక్రమంలో వారు ఇతరుల భావాలను అర్థం చేసుకోరు. దీనివల్ల ఇతరులతో వారి సంబంధాలు విఫలం అవుతుంటాయి.
● వాళ్ళు చిన్నచిన్న విమర్శలకే తీవ్రంగా కలత చెందుతారు. ఎవరైనా ఏదైనా సాయం చేయకపోతే కోపంగా మారిపోతారు.
● ఇతరులపై అసూయపడతారు. ఇతరులు తమపై అసూయపడతారని నమ్ముతారు.
● ఇతరులను తక్కువ అంచనా వేస్తారు. తనను తాను ఉన్నతంగా నమ్ముతారు.
● కొందరు వ్యక్తులతో మాత్రమే సంభాషించాలని భావిస్తారు.

నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్

కారణాలు

● బాల్యంలో ఎదురైన చేదు అనుభవాలు, బాధలు, వేధింపులు

● కుటుంబ పరిస్థితులు, ఇతర కుటుంబ సభ్యుల ప్రభావం

● జన్యుపరమైన కారణాలు

● ఆలోచనా విధానంలో లోపం

● సామాజిక, సాంస్కృతిక ప్రభావం

నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ నుంచి బయటపడటం ఎలా..?

వైద్య నిపుణుల ద్వారా దీర్ఘకాలిక కౌన్సెలింగ్, తగిన మందుల వినియోగం ద్వారా ఈ డిజార్డర్ నుంచి రక్షణ పొందొచ్చు.

  Last Updated: 01 Feb 2023, 11:19 AM IST