Site icon HashtagU Telugu

Mysore Pak: మైసూర్ పాక్.. ఇలా చేస్తే చాలు కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తారు?

Mixcollage 09 Jan 2024 05 53 Pm 9090

Mixcollage 09 Jan 2024 05 53 Pm 9090

మామూలుగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అనేక రకాల స్వీట్ రెసిపీ లను ఇష్టపడి తింటూ ఉంటారు. అటువంటి వాటిలో మైసూర్ పాక్ కూడా ఒకటి. చాలామంది ఈ రెసిపీని ఇంట్లో చేయాలనే ప్రయత్నించినప్పటికీ చేయడం సరిగా రాక కొన్ని కొన్ని సార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది. దీంతో చాలామంది బయట కొనుగోలు చేసి తింటూ ఉంటారు. అయితే బయటకొనే పని లేకుండా సింపుల్గా ఇలా చేస్తే చాలు మైసూర్ పాక్ కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తారు. మరి ఈ రెసిపీ కి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మైసూర్ పాక్ కావాల్సిన పదార్థాలు:

చక్కెర – 2 కప్పులు
బేకింగ్ సోడా – చిటికెడు
శనగపిండి- 1 కప్పు
నెయ్యి-2 కప్పులు
నీరు -1/2 కప్పు

మైసూర్ పాక్ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా ఒక పాన్‌లో 1 కప్పు నెయ్యి మీడియం మంటమీద వేడి చేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత శనగపిండిని అందులో వేసి కొన్ని నిమిషాలు వేయించాలి. అలా శనగపిండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత పంచదార, నీటిని ప్రత్యేక పాన్‌లో తీగలాగా ఉండే వరకు మరిగించాలి. ఆపై సిద్ధం చేసుకున్న చక్కెర పానకంలో వేయించిన శెనగపిండిని వేసి, అది చిక్కబడే వరకు గట్టిగా కలపాలి. మిగిలిన నెయ్యిని ఆ శనగపిండి మిశ్రమంలో వేయాలి. ముద్దలు ఏర్పడకుండా నిరంతరం కలపాలి. నెయ్యి విడిపోవడం ప్రారంభించినప్పుడు వంట సోడా వేసి కలపాలి. తర్వాత ఒక ప్లేటుకు నెయ్యి రాసి ఆ ప్లేట్‌లో పోయాలి. మిశ్రమాన్ని సున్నితంగా వెడల్పుగా చేసి చల్లార్చాలి. ఇది పూర్తిగా సెట్ అయ్యే ముందు అవసరమైన ఆకారాలలో ముక్కలు చేయండి. గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ రెడీ.