Relationship: నా వయస్సు ఇంకా 17, కానీ అతడే నా జీవితం, ఏం చేయాలో చెప్పండి..!!

నేను 17 ఏళ్ల అమ్మాయిని. నేను ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నాను. నేను ఎప్పుడూ చదవులో ముందుంటాను. అందుకే నా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా గర్వపడుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 11:00 AM IST

ప్రశ్న:  నేను 17 ఏళ్ల అమ్మాయిని. నేను ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నాను. నేను ఎప్పుడూ చదవులో ముందుంటాను. అందుకే నా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా గర్వపడుతున్నారు. కానీ, నా సమస్య ఏమిటంటే, నేను నాకంటే చాలా పెద్దవాడైన అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మేము గత మూడు సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాము. అతను మంచి వ్యక్తి, నన్ను చాలా ప్రేమిస్తాడు. కానీ సమస్య ఏమిటంటే అతడు పెద్దగా చదువుకోలేదు. అతనికి చదవడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ అతను నన్ను బాగా చూసుకుంటానని ఎప్పుడూ హామీ ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ, నేను అతనిని చాలా నమ్ముతాను. కానీ నేను ఐఏఎస్‌ అధికారి కావాలని మా తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

నాకు చదువుపై చాలా ఇష్టం ఉంది. నా మార్కులు చూసి నా తల్లిదండ్రులు జీవితంలో మంచి స్థానం పొందుతానని అనుకుంటున్నారు. కానీ నేను నా ప్రియుడిని చాలా ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించిన అబ్బాయి కూడా రీసెంట్‌గా ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఏదో ఒకరోజు మంచి కంపెనీలో పనిచేసి డబ్బు సంపాదించగలనని చెబుతున్నాడు. కానీ నా తల్లిదండ్రులు నన్ను IAS అధికారిగా చూడాలని అనుకుంటున్నారు. కానీ నా ప్రియుడు IAS పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం దాదాపు అసాధ్యం. కాబట్టి మా పెళ్లికి నా తల్లిదండ్రులు ఎప్పటికీ అంగీకరించరు. ఈ విషయాలన్నీ ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు?

నిపుణుల నుండి సలహా: ఫోర్టిస్ హెల్త్‌కేర్ మెంటల్ హెల్త్ హెడ్ కామ్నా ఛిబ్బర్ ప్రకారం, మీ జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఇంకా చాలా చిన్న వయస్సులోనే ఉన్నారు. ప్రస్తుతం మీరు మీ చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి. మీ తల్లిదండ్రులు మీపై ఆశలు పెట్టుకోవడం సహజం. నువ్వు కూడా జీవితంలో పురోగతిని చూడాలని కోరుకుంటున్నావు, అది తప్పు కాదు. అటువంటి పరిస్థితిలో, ఈ సమయంలో నీ పూర్తి దృష్టిని చదువుపైనే కేంద్రీకరించాలి. మీ భాగస్వామిని కూడా అలా చేయమని అడగండి.

మీరు చెప్పినట్లుగా మీ తల్లిదండ్రులు డబ్బు కంటే గౌరవప్రదమైన పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి పరిస్థితిలో, మీ ప్రేమికుడితో భవిష్యత్తు ప్లాన్స్ గురించి మాట్లాడుకోండి. మీ ఇద్దరికీ మంచి కెరీర్ ఉన్నప్పుడు, మీ తల్లిదండ్రులు మీతో నిలబడతారు.

మీరు కూడా మైనర్, పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది
నువ్వు చెప్పినట్లు నీకు 17 ఏళ్లు మాత్రమే. ఈ స్థితిలో మీ ప్రేమికుడిని వివాహం కోసం కనీసం 4 సంవత్సరాలు వరకు వేచి ఉండాల్సిందే. ఎందుకంటే నువ్వు ఇంకా మైనర్‌గానే ఉన్నావు. ఇది రిలేషన్ షిప్ లో ఉండే వయసు కాదు. మీరు మీ కెరీర్‌పై పూర్తిగా దృష్టి సారించాల్సిన వయస్సు.

ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ప్రస్తుతం టీనేజీ ప్రేమలో ఉన్నారు. ఈ వయసులో మీకు ఏది సరైనది. ఏది తప్పు అని అర్థం చేసుకునే అవకాశం ఉండదు. ఇది మాత్రమే కాకుండా మీ తల్లిదండ్రుల అభిప్రాయాన్ని కూడా అర్థం చేసుకోండి.