Relationship : మా అత్తగారి కారణంగా నేను నా భర్తతో సన్నిహితంగా గడపలేకపోతున్నా…ఏం చేయను.?

అమ్మ ఎవరికైనా అమ్మే. బిడ్డ పుట్టిన క్షణం నుంచి పెద్దయ్యేంత వరకు అమ్మ లాలిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తన జీవితమంతా బిడ్డకు అంకితం చేస్తుంది.

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 09:41 PM IST

ప్రశ్న: నా పేరు స్వప్న( పేరు మార్చాం) మాది చిన్న కుటుంబం. మా ఇంట్లో నేను, నా భర్త, మా అత్తగారు ఉంటాం. మాకు వివాహం జరిగిన సంవత్సరం అవుతుంది. నేను నా భర్తతో సన్నిహితంగా గడపలేకపోతున్నా. కారణం మా అత్తగారు. మాకు ప్రైవసీ ఇవ్వరు. నా భర్తతో దగ్గరగా ఉన్న ప్రతిసారీ మా గదిలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. మేమిద్దరం కూర్చుని ఏదైనా చర్చించుకుందాం అనుకున్న ప్రతిసారీ ఆమె మా విషయాల్లో తలదూర్చుతుంది. ఇది నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.  నా సమస్యకు పరిష్కారం ఏంటి. ?

జవాబు: అమ్మ ఎవరికైనా అమ్మే. బిడ్డ పుట్టిన క్షణం నుంచి పెద్దయ్యేంత వరకు అమ్మ లాలిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తన జీవితమంతా బిడ్డకు అంకితం చేస్తుంది. బిడ్డకు జన్మనివ్వడం నుంచి పెంచి పోషించి విద్యాభ్యాసం వరకు అన్నీ ఆమై చేస్తుంది. కొడుకు పెళ్లి తర్వాత కోడలు రాగానే…తల్లి కొంచెం అభద్రతాభావం, నిస్సహాయతను ఎదుర్కొంటుంది. ఇది అందరి తల్లుల్లోనూ ఉంటుంది.

మీరు మీ జీవితంలో మార్పు కోరకుంటే ముందుగా మీ అత్తగారికి దగ్గరవ్వండి. మీ భర్తతో మరింత సమయం గడపాలనుకుంటే…మీ అత్తగారు అడ్డుకుంటున్నారన్న అభద్రతా భావంతో మీరు ఉండకండి. మీరు అవసరం లేని విషయాలపై దృష్టి పెట్టడం మానుకోండి. మీరు కోరుకునే దానికంటే మీకు కావాల్సిన దాని గురించి మాట్లాడటం ప్రారంభించండి. కొద్ది రోజుల్లో ఓ బిడ్డకు జన్మనిస్తారు. మీ జీవితాన్ని…ఆ బిడ్డకు చదువు, విలువలు, వివాహం ఇలా అన్ని బాధ్యతలు మీరే చేసుకుంటారు. తన జీవితంలో కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మీరు కూడా అలాంటి భావనే ఎదుర్కొంటారు కదా?.

ముందుగా మీ అత్తగారి పట్ల ప్రేమతో మెదలండి. మీ భర్త మీ అత్తకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరే మీ అత్తగారికి దగ్గరవ్వండి. మనస్సు విప్పి మాట్లాడుకోండి. ఆమెను అర్థం చేసుకోండి. కొడుక కోడలు సుఖంగా ఉండాలనే ప్రతి అత్త కోరుకుంటుంది. కాబట్టి అనవసర విషయాలతో కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు. ఇంట్లో అత్తమామలు ఉన్న సంతోషం…వారు లేకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టంగా ఉంటుంది. మీ అమ్మగారు ఒకరికి అత్తగారే అనే విషయాన్ని మర్చిపోవద్దు. సమస్యలు వస్తుంటాయి. వాటిని పరిష్కరించుకోవడం మన చేతుల్లో ఉంటుంది. అంతేకానీ ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేస్తూ …వైవాహిక జీవితంలో గొడవలకు దారి తీసేలా చూడకూడదు.